నాగ చైతన్య-శోభిత ఎంగేజ్మెంట్... సమంత హార్ట్ బ్రేక్, సంచలనం రేపుతున్న ఇంస్టాగ్రామ్ పోస్ట్!

నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఈ క్రమంలో నాగ చైతన్య మాజీ భార్య సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనం రేపుతోంది. ఆమె హార్ట్ బ్రేక్ ఎమోజీ పోస్ట్ చేసింది. 
 

హీరో నాగ చైతన్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేయనున్నారు. ఆగస్టు 8న శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో శోభిత-నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. కొత్త జంట కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. 

నాగ చైతన్య-శోభితకు అభిమానులు శుభాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నాగ చైతన్య, శోభిత మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. రెండేళ్లుగా వీరి ఎఫైర్ పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో విహరిస్తున్న నాగ చైతన్య,శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి. 


Samantha

నాగ చైతన్య, శోభిత పెళ్లి బంధంతో త్వరలో ఒక్కటి కానున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య మాజీ భార్య సమంత రియాక్షన్ ఏమిటి? అనే సందేహం అందరిలో ఉంది. కాగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు పోస్ట్స్ పెట్టింది. ఒక పోస్ట్ లో ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ పోస్ట్ చేశారు. అయితే ఆమె బాధపడుతుంది నాగ చైతన్యకు మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతుందని మాత్రం కాదు. 

ప్రముఖ రెజ్లర్ వినేష్ పొగట్ అనూహ్యంగా పారిస్ ఒలింపిక్స్ 2024కి డిస్క్వాలిఫై అయ్యింది. ఆ వేదనతో వినేష్ పొగట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వినేష్ పొగట్ తల్లికి ఎమోషనల్ సందేశం రాశారు. వినేష్ పొగట్ రాసిన సదరు సందేశాన్ని షేర్ చేసిన సమంత తన బాధను వ్యక్తం చేస్తూ హార్ట్ బ్రేక్ ఎమోజీ షేర్ చేశారు. అయితే నేడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన హార్ట్ బ్రేక్ సింబల్ కొంత మేర సింక్ అయ్యిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

2017లో నాగ చైతన్య-సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు వీరి వైవాహిక బంధం సాగింది. 2021లో మనస్పర్థలు తలెత్తాయి. 2021 అక్టోబర్ నెలలో పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాగ చైతన్య జంటను వెతుకున్నాడు. మరి సమంత కూడా రెండో వివాహం చేసుకుంటుందా? లేక సింగిల్ గా ఉండిపోతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. 

Latest Videos

click me!