మేకప్ లేకుంటేనే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు, నా అందం గురించి మాట్లాడుకునేవి నిజాలే.. గిరిజా ఓక్ కామెంట్స్

Published : Jan 05, 2026, 12:27 PM IST

నటి గిరిజా ఓక్ నేషనల్ క్రష్ గా మారిపోయారు. ఆమె నేచురల్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. గిరిజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేకప్ లేకుండా ఉండడమే తనకు ఇష్టం అని తెలిపారు. 

PREV
15
యువతకి క్రష్ గా మారిన గిరిజా ఓక్ 

లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గిరిజా ఓక్ ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. యువతలో ఆమెకి పాపులారిటీ బాగా పెరిగింది. 38 ఏళ్ళ వయసులో యువతకి గిరిజా ఓక్ క్రష్ గా మారిపోయారు. ఆమె బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, సింపుల్ లుక్ లోనే అందంగా కనిపించడం ఇవన్నీ నెటిజన్లకు బాగా నచ్చేశాయి. దీనితో ఆమెకి సంబంధించిన దృశ్యాలని తెగ వైరల్ చేస్తున్నారు. 

25
రొమాంటిక్ సీన్స్ లో నటించిన గిరిజా ఓక్ 

మరాఠీ నటి అయిన గిరిజా ఓక్ మరాఠీతో పాటు అనేక హిందీ చిత్రాల్లో కూడా నటించారు. దశాబ్దాలుగా ఆమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇటీవల మాత్రమే క్రేజ్ వచ్చింది. అది కూడా సోషల్ మీడియా వల్ల. గిరిజా ఎక్కువగా గ్లామర్ ప్రదర్శించరు. కానీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో నటించారు. లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో గిరిజా నటించారు. 

35
మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు 

గిరిజా ఓక్ ఎక్కువగా చేనేత చీరలు ధరిస్తూ అందంగా కనిపించడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ సీక్రెట్ ని గిరిజా రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. తనకి మేకప్ వేసుకోవడం అంతగా ఇష్టం లేదు అని.. కేవలం సినిమాల్లో నటించేటప్పుడు ఆ పాత్రకి తగ్గట్లుగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటాను అని గిరిజ తెలిపారు. అభిమానులు కూడా నన్ను ఎక్కువ మంది మేకప్ లేకుంటేనే ఇష్టపడతారు అని గిరిజ తెలిపింది. 

45
మేకప్ లేకుంటేనే అందంగా ఉన్నానని అన్నారు 

చాలా మంది మేకప్ లేకుండా సింపుల్ లుక్ లోనే తాను అందంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాయి. సింపుల్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు గిరిజ పేర్కొంది. మేకప్ లేకపోతే కాన్ఫిడెన్స్ లేనట్లుగా భావించకూడదు. నోమెకప్ లుక్ తో కూడా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని గిరిజా పేర్కొంది. 

55
నా అందం గురించి వినిపించేవి నిజాలే 

నేను అందంగా, క్యూట్ గా ఉంటాను, అమేజింగ్ పర్సన్ ని నేను.. ఇలా నా గురించి బయట మాట్లాడుకుంటున్న విషయాలు అన్నీ నిజం అంటూ గిరిజా ఫన్నీగా పేర్కొంది. గిరిజా చివరగా షారుఖ్ ఖాన్ జవాన్, ది వాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జండే లాంటి సినిమాల్లో నటించింది. సౌత్ నటుడు సందీప్ కిషన్ తో కలిసి గతంలో ఆమె షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories