ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ సముద్రం ముందర తులసి గారు తులసి గారు అని అరుస్తూ ఉంటారు. ఈలోగ అక్కడున్న జనాలు, ఎవరైనా బీచ్ లోపలి కొట్టుకొని పోతే తిరిగి వచ్చినట్టు చరిత్రలోనే లేదు అని అంటారు. సామ్రాట్ కి ఇంకా భయం వేసేస్తుంది ఈ లోగ వెనకాతల నుంచి తులసి రెండు మొక్కజొన్నలు పట్టుకొని వస్తుంది. అదేంటి సామ్రాట్ గారు ఆ రాయి వైపు వెళ్లొద్దన్నారు కదా ఇప్పుడు మీరే వెళ్తున్నారు ఏంటి అని నవ్వుతూ అడగగా సామ్రాట్ కి కోపమొచ్చి అసలు మీకు ఏమైనా బుద్ధుందా. చిన్న పిల్లల బీచ్ కి వచ్చి ఆడుకుంటే చిన్నపిల్లలు అయిపోయినట్టు అనుకుంటారా ఎక్కడికి వెళ్తున్నారో కనీసం నాకు చెప్పి వెళ్లాలి కదా మిమ్మల్ని ఇక్కడికి తెచ్చినందుకు బాధ్యత నాదే కదా అని తిడతాడు.