నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావో తెలుసు... అవి తలచుకుని కన్నీరు పెట్టుకున్న ఛార్మి ఓదార్చిన పూరి 

Published : Aug 18, 2022, 10:23 AM IST

పూరి జగన్నాధ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది లైగర్  మూవీ. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిర్మాత ఛార్మి హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda, పూరి జగన్నాథ్ లను ఇంటర్వ్యూ చేశారు.   

PREV
16
నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావో తెలుసు... అవి తలచుకుని కన్నీరు పెట్టుకున్న ఛార్మి ఓదార్చిన పూరి 
Liger Movie


ప్రేక్షకుల కోణంలో లైగర్ మూవీ విషయంలో నెలకొన్న సందేహాలు, అంచనాలు ఛార్మి అడగడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె లైగర్(Liger) నిర్మాణంలో ఎదురైన ఆర్థిక కష్టాలు తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఒక ప్రక్క లాక్ డౌన్, చేతిలో రూపాయి లేదు. అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. 
 

26
Liger Movie


ఇంటర్వ్యూలో ఛార్మి దర్శకుడు పూరీని ఓ ప్రశ్న అడిగారు. లోక్ డౌన్ సమయంలో మన దగ్గర ఒక్క రూపాయి లేదు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సమయంలో భారీ ఓటీటీ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ రిజెక్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. కఠిన పరిస్థితుల్లో ఉండి కూడా ఓటీటీ ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేశారని పూరీని ఛార్మి అడగడం జరిగింది. 
 

36
Liger Movie

ఈ ప్రశ్న అడుగుతూ ఛార్మి ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఛార్మిని చూసిన పూరి(Puri jagannadh) కూడా ఎమోషనల్ అయ్యాడు. లైగర్ నిర్మాణంలో నువ్వు పడ్డ కష్టాలు తెలుసు. ఎన్నోసార్లు ఏడ్చావు. నీ భాద నాకు అర్థం అవుతుంది అన్నారు. 
 

46
Liger Movie


అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయింది. ఒకవేళ సినిమా విజయం సాధించకపోతే, ప్రేక్షకులకు నచ్చకపోతే పరిస్థితి ఏంటని? కూడా ఛార్మి(Charmi) పూరీని అడిగారు. ఈ ఆసక్తికర ప్రశ్నలకు పూరి ఏం సమాధానం చెప్పదనేది సస్పెన్సు. కారణం ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదలైంది. పూర్తి ఇంటర్వ్యూ ఆగస్టు 19న రానుంది. 
 

56
Liger Movie


ఇక ప్రోమో చివర్లో ఛార్మి ఆసక్తికర కామెంట్ చేశారు. రెండు విషయాలు మా ఇద్దరిని నడిపించాయి. దాని వలెనే మేము ఇక్కడికి వరకూ వచ్చామని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికర ప్రశ్నలతో సాగినట్లు అర్థం అవుతుంది. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి. 

66
Liger Movie


పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో లైగర్ ఆగస్టు 25న విడుదల కానుంది పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నాడు. 

click me!

Recommended Stories