Trisha: త్వరలో త్రిష పొలిటికల్ ఎంట్రీ, జయలలిత రేంజ్ లో కలలు.. రెచ్చగొడుతున్న ఆ స్టార్ హీరో ఎవరు?

First Published Aug 18, 2022, 10:47 AM IST

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్ల ప్రభావం, వయసు పెరుగుతుండడం కారణంగా సహజంగానే త్రిషకి అవకాశాలు తగ్గాయి. 

అయినప్పటికీ పొన్నియన్ సెల్వం లాంటి క్రేజీ చిత్రాల్లో ఈ చెన్నై చిన్నది అవకాశాలు దక్కించుకుంది. అయితే కోలీవుడ్ లో త్రిష గురించి షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. త్రిష రాజకీయాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతోందట. 

త్రిషకి రాజకీయాల పట్ల ముందు నుంచి అవగాహన, ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన టైం వచ్చిందని త్రిష తన సన్నిహితులతో చెప్పిందని సమాచారం. జయలలిత, ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్ లో రాణించాలని త్రిష కలలు కంటోందట. 

త్రిషకి రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడానికి ఓ స్టార్ హీరో కారణం అని కూడా తెలుస్తోంది. అతడు ఎవరో కాదు.. దళపతి విజయ్. త్రిషని రాజకీయంగా విజయ్ రెచ్చగొడుతున్నాడు అని.. ఆమెకి పాలిటిక్స్ పట్ల ఆలోచనలు పెరిగేలా విజయ్ చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్రిష, విజయ్ కలసి ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించారు. విజయ్ నటించబోయే తదుపరి చిత్రంలో త్రిషకి ఛాన్స్ దక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ చనువుతో విజయ్.. త్రిషకి పొలిటికల్ గా సలహాలు ఇస్తున్నారట. 

వెనుక ఉండి త్రిషకి పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నట్లు విజయ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలని కొందరు ఖండిస్తున్నారు. విజయ్ సొంతంగా పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో విజయ్ కూడానా రాజీకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు విజయ్ ఎవరినో ఎందుకు రాకీయాల్లోకి వెళ్ళమని చెబుతాడు అని అంటున్నారు. 

ఏది ఏమైనా త్రిష తొందరపడి జయలలిత రేంజ్ లో కలలు కంటూ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే భంగపాటు తప్పదు అని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నిర్ణయం అయినా ఆచితూచి తీసుకోవాలని అంటున్నారు. 

click me!