అప్పుడు లాస్య కాసేపు కూర్చోవాల్సిందే కదా నందు అనడంతో నువ్వు నా మీద పన్నీరు చదవలేదు సాంబార్ చల్లావు అని అంటాడు. అదేంటి నందు నేను ఉత్తమ ఇల్లాలు అవుతాను అంటే నువ్వే అడ్డుపడుతున్నావు అని అనగా ముందు ఫ్రీగా ఉండడం నేర్చుకొని తర్వాత ఉత్తమ ఇల్లాలు అవుదువు అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సామ్రాట్,తులసి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు తులసి ఉన్నఫలంగా నవ్వడంతో ఏం జరిగింది అని అడగగా తులసి జరిగింది మొత్తం వివరించి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కూడా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తులసీ తన పిల్లల గురించి ఆలోచిస్తూ అందరిని ఏదో ఒక ప్రొఫెషన్ లో బిజీ బిజీగా ఉండేలా చేయాలి నందగోపాల్ గారి పరిస్థితి కూడా బాగోలేదు.