Guppedantha Manasu: వసుని రిషి దగ్గరికి వెళ్లిపోమని చెప్పిన చక్రపాణి.. ఇంటి నుంచి వెళ్ళిపోతున్న రిషి?

First Published Jan 16, 2023, 9:11 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బాధపడుతూ రిషిధార నుంచి ధార కేవలం కన్నీటి ధారగానే మిగిలిపోయింది అనుకుంటూ ఉంటుంది. నేను దురదృష్ట జాతకురాలిని మిమ్మల్ని బాధ పెట్టాను అని అనడంతో వెంటనే రిషి నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే ఇప్పటికే మర్చిపోలేక పోతున్నాను వసుధార అని అనుకుంటూ ఉంటాడు. నన్ను నువ్వు బాధ పెడితే నాకంటే బాధ నీకే ఎక్కువ ఉండాలి కదా ఎందుకంటే, నువ్వు నేను వేరు వేరు కాదు కదా అని బాధతో మాట్లాడుతాడు రిషి. చేతి మీద రాతలు అంటే నీటిమీద రాతలే అని ఆరోజు నేను తెలుసుకోలేదు వసుధార అని అంటాడు. అప్పుడు వసుధార తన తాళిబొట్టుకు ఉన్న ఉంగరాన్ని చూసుకుంటూ నుదుటి రాతలు ఎలా ఉన్నాయో ఏంటో మనం ఏం చేయగలం రిషి సార్, ఇంకా ఎన్నాళ్లో మనము కలుసుకునే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను సార్ అని అంటుంది.
 

అప్పుడు రిషి దూరం ఇంత భారమా వసుధార దీనిని భరించడం నా వల్ల కాదు అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రిషి వసుధారతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జగతి కాఫీ తీసుకొని వస్తుంది. రిషి నువ్వు పంపిన మెయిల్ చూశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా దేవయాని ఎదురు పడుతుంది. అప్పుడు పట్టించుకోకుండా దేవయాని రిషి దగ్గరికి వెళుతుంది. ఆ తర్వాత దేవయాని నాన్న రిషి ఏదో మాట్లాడాలి అన్నావు కదా అనగా అవును పెద్దమ్మ. ఇప్పుడు మన కాలేజీ ఫ్యాకల్టీ ఇంటికి వస్తారు, వాళ్లతో మీరు మాట్లాడాలి అనగా ఏం మాట్లాడాలి రిషి అని అంటుంది దేవయాని. వాళ్లు వచ్చాక మీకే తెలుస్తుంది పెద్దమ్మ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. 
 

ఆ తర్వాత కాలేజీ స్టాప్ ఇంటికి రావడంతో దేవయాని ఏమి తెలియనట్టుగా నటిస్తూ కాలేజీ స్టాప్ మీరు లెక్చరర్స్ బాగా ఉండాలి కానీ ఇలా రిషి వసు గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడారు కరెక్టేనా అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని ప్లేట్ ఫిరాయించడంతో కాలేజీ స్టాఫ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్లు వసుధారని తిట్టమని చెప్పింది ఈవిడే కదా మళ్లీ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఏంటండీ నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మీరేం మాట్లాడలేదు గుసగుసలు పెడుతున్నారు ఏంటి? ఏం లేదు మేడం జరిగిందేదో జరిగిపోయింది మాది పొరపాటు అయింది ఈసారి క్షమించండి అని అంటారు.
 

అప్పుడు జగతి వసుధార ఇక్కడ లేదు కదా వీళ్ళని ఎందుకు పిలిపించావు అని అడగడంతో మరొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలని పిలిపించాను అని అంటాడు రిషి. అప్పుడు దేవయాని తన మనసులో వీళ్ళు నేనే పురమాయించాను ఇప్పుడు వీళ్ళకి నేనే నీతులు చెబితే నన్ను వీళ్ళు తప్పుగా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటుంది దేవయాని. తర్వాత కాలేజీ స్టాప్ అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరొకవైపు వసుధార, సుమిత్ర చక్రపాణికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి వసును తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండగా నాన్న ఏంటి నాన్న ఇది అని అడగడంతో, దేవుడు గొప్పవాడమ్మా సంతోషానికైనా బాధ కైనా కన్నీళ్లను ఇచ్చాడు అని అంటాడు.
 

నా కూతురు విషయంలో నేను చాలా పొరపాటు చేశాను నా కూతురిని నమ్మడానికి నాకు ఇన్నేళ్లు సమయం పట్టింది. సుమిత్ర మన కూతురు విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి అని అనగా మనం కాదండి. వసు జీవితాన్ని ఆ దేవుడే నిర్ణయించాలి అని అంటుంది. అప్పుడు చక్రపాణి భోజనం వద్దు అనగా వసుధర బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి అమ్మ నీ బ్యాగ్ పక్కన ఒక కవర్ ఉంటుంది అది తీసుకొనిరా అని అనడంతో సరే అని లోపలికి వెళ్లి ఆ కవర్ తీసుకొని వస్తుంది. ఈ టికెట్ తీసుకొని నువ్వు నీ భవిష్యత్తుని వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపో అనడంతో వసుధార ఆశ్చర్యపోతుంది. పసిదానికి ఆ టికెట్ ఇచ్చి వీలైతే ఈ నాన్నని క్షమించు అని అంటాడు. పిలవాలనిపిస్తే పిలువు వచ్చి నాలుగు అక్షింతలు వేసి మిమ్మల్ని దీవిస్తాము అని ఎమోషనల్ గా మాట్లాడుతారు చక్రపాణి.

అప్పుడు వసుధార చేసిన పనికి చక్రపాణి మెచ్చుకుంటూ ఉండగా అది చూసి సుమిత్ర సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు రిషి  బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుండగా అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి ఏంటిది సూట్కేస్ తో వచ్చావ్ ఏంటి అని దేవయాని అడగగా వెళ్తున్నాను పెద్దమ్మ అనడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎక్కడికి వెళ్తావు రిషి అందర్నీ వదిలేసి వెళ్లడం కరెక్టా అని దేవయాని అడగడంతో,పెద్దమ్మ ఏ బంధం ఎన్నాళ్లు ఎవరికి తెలుసు. కొద్దిరోజులు నేను అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటాడు రిషి. ఎన్ని రోజులు అని మహేంద్ర అడగడంతో ఏమో అది నాకు కూడా తెలియదు అని అంటాడు రిషి.
 

పారిపోతున్నావా రిషి అని మహేంద్ర అడగడంతో మనుషుల నుంచి పారిపోవచ్చు కానీ నా మనసు నుంచి నేను ఎక్కడికి పారిపోలేను డాడ్ అని అంటాడు. అప్పుడు దేవయాని ఎవరో మోసం చేశారని అనగా పెద్దమ్మ ఎవరో మోసం చేశారని నేను పారిపోయే పిరికి వాడిని కాదు. నచ్చడం లేదు నాకు నేనే నచ్చడం లేదు అందుకే కొద్దిరోజులు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటాడు రిషి. అప్పుడు రిషి మాటలకు అందరూ బాధపడుతూ ఉంటారు. మరి నువ్వు వెళ్ళిపోతే కాలేజ్ ని ఎవరు చూసుకుంటారు రిషి అని ఫణింద్ర అడగడంతో నా తర్వాత కాలేజ్ ని జగతి మేడం చూసుకుంటారు అని రిషి అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఈ విషయం గురించి నేను ఆల్రెడీ మేడంకి మెయిల్ చేశాను.

జగతికీ మెయిల్ చేస్తే సరిపోతుందా రిషి మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేయాలి కదా అని దేవయాని అనడంతో మినిస్టర్ సార్ కీ కూడా మెయిల్ చేశాను అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర, రిషి వెళ్లడం అవసరమా అనడంతో అత్యంత అవసరం డాడ్ అని అంటాడు. ఎక్కడికి వెళ్తావు అనడంతో నేను ఎవరో తెలియని కొత్త ప్రదేశానికి వెళ్తాను అని అంటాడు రిషి. మహేంద్ర ఎప్పుడు వస్తావు అని అడగడంతో ఏమో వస్తానో రానో నాకు తెలియదు అనగా జగతి షాక్ అవుతుంది.

click me!