ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ హనీ తో మాట్లాడుతూ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అన్న తక్కువ ఏమి కాదమ్మా అని అనగా నాకు కావాల్సింది నీ ఓదార్పు కాదు ఫస్ట్ ర్యాంక్ అని అంటుంది హనీ. ఎగ్జామ్స్ రిజల్ట్ రేపు వస్తాయి నా ఫ్రెండ్ తో నేను ఈసారి ఫస్ట్ వస్తానని చాలెంజ్ చేశాను రాకపోతే నీ పరువు నా పరువు పోతుంది అని అంటుంది హనీ. మనం కష్టపడటం వరకే అని మిగిలింది మొత్తం ఆ దేవుడే చూసుకుంటాడు అని అనగా వెంటనే హనీ మొన్న ఒకసారి నువ్వు తులసి ఆంటీ తో ఒక మాట అన్నావ్ గుర్తుకు ఉందా డాడీ అనగా ఏమన్నాను అనడంతో మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటే ఏదీకాదనడు అని అన్నావు కదా డాడీ అని అంటుంది హనీ.