రూ.5 కోట్లు అప్పు చేసి ఆ పని పూర్తి చేసిన పవన్.. రీమేక్స్ వద్దని ఇంకా ఇబ్బంది పెడదామా, ఫ్యాన్స్ కొత్త వాదన

Published : Dec 10, 2022, 10:27 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు వరుస చిత్రాలతో పెద్ద బాధ్యతలే మోస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
17
రూ.5 కోట్లు అప్పు చేసి ఆ పని పూర్తి చేసిన పవన్.. రీమేక్స్ వద్దని ఇంకా ఇబ్బంది పెడదామా, ఫ్యాన్స్ కొత్త వాదన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు వరుస చిత్రాలతో పెద్ద బాధ్యతలే మోస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. అయితే భవదీయుడు చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. 

27

ఇంతలోనే సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో మరో చిత్రం ప్రకటించారు. ఈ చిత్రంతో పవన్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ కాకుండా స్ట్రైట్ మూవీ చేస్తున్నారని పవన్ అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఈ సంతోషాన్ని ఆస్వాదించే లోపే మరో న్యూస్ పీకే ఫ్యాన్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది. త్వరలో హరీష్ శంకర్, మైత్రి మూవీస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తేరి చిత్ర రీమేక్ ప్రకటించబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. 

37

భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టి.. తేరి రీమేక్ తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నారనే రూమర్స్ రావడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ మొదలు పెట్టారు. రెండు రోజుల నుంచి ' వి డోంట్ వాంట్ తేరి రీమేక్' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండింగ్ గా నిలిచింది. తేరి రీమేక్ ప్రకటిస్తే సూసైడ్ చేసుకుంటాం అని కూడా కొందరు అభిమానులు మైత్రి సంస్థకి, హరీష్ శంకర్ కి వార్నింగ్ ఇస్తున్నారు. 

47

ప్రస్తుతం ఓటిటి యుగంలో రీమేక్ చిత్రాలు మునుపటిలా వర్కౌట్ కావడం లేదు అనేది పవన్ అభిమానుల వాదన. అయితే జనసేన నాయకుడు హరిప్రసాద్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హరిప్రసాద్ మాట్లాడుతూ..ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నా ముందే రూ 5 కోట్లు అప్పు చేశారు. విధిగా ట్యాక్స్ చెల్లించారు అని తెలిపారు. దీనితో పవన్ తనకి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. ట్యాక్స్ ఎగవేత లాంటి అవినీతికి పాల్పడడం లేదు అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 

57
Pawan Kalyan

క్రమంలో అభిమానులు కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రకమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. రీమేక్ చిత్రాలు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాలు పూర్తవుతాయి. పవన్ ఆర్థిక సమస్యలు తగ్గి ఆదాయం పెరుగుతుంది. జనసేన పార్టీని నడిపించడానికి  ఆసరా ఉంటుంది. అభిమానులు ఈ విషయం అర్థం చేసుకోవాలి. 

67

ట్యాక్స్ చెల్లించడం కోసం కోట్లాది రూపాయలు అప్పు చేసే పవన్.. ఇంకా రీమేక్ లు వద్దని ఇబ్బంది పెడదామా అని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రీమేక్ లు చేయడం వద్దని చెప్పడం మానేసి పవన్ ని అర్థం చేసుకోండి అంటున్నారు. అదే స్ట్రైట్ మూవీ చేయాలంటే ఎక్కువ సమయం వృధా అవుతుంది. బడ్జెట్ కూడా పెరుగుతుంది. 

 

77

మైత్రి లాంటి సంస్థల వద్ద పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ లు తీసుకుని ఉన్నారు. దీనితో ఆ సంస్థలకు తప్పనిసరిగా పవన్ సినిమా చేయాల్సి ఉంది. త్వరలో ఏపీలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా చిత్రాలని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ స్ట్రైట్ చిత్రాలు చేస్తే ఎన్నికలలోపు కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి కావడం కష్టం. 

Read more Photos on
click me!

Recommended Stories