హైదరాబాద్ కి చేరుకున్న ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ పోటీలకు రంగం సిద్ధం, కానీ

Published : May 09, 2025, 01:19 PM ISTUpdated : May 09, 2025, 01:20 PM IST

Miss World 2025 Hyderabad: మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. మే 10 నుంచి 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా హైదరాబాద్ లో ప్రారంభం అవుతాయి.

PREV
15
హైదరాబాద్ కి చేరుకున్న ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ పోటీలకు రంగం సిద్ధం, కానీ
Miss World 2025 Hyderabad

Miss World 2025 Hyderabad: మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. మే 10 నుంచి 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా హైదరాబాద్ లో ప్రారంభం అవుతాయి. నిర్వాహకులు మూడు వారాలపాటు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నారు.

25
Krystyna Pyszkova

దీనికోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 111 దేశాలకు సంబంధించిన సుందరిమణులు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మొత్తం 116 దేశాలకు సంబంధించిన మోడల్స్ హైదరాబాద్ కు రావాల్సి ఉంది.
 

35
Krystyna Pyszkova

అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వాళ్ళు రావడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మోడల్స్ తో పాటు, అంతర్జాతీయ మీడియా, కొందరు స్పాన్సర్ ఇంకా హైదరాబాద్ కి చేరుకోలేదని సమాచారం.
 

45
Revanth Reddy

ఇదిలా ఉండగా 2024 లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆమెకి అధికారులు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. గతంలో ఆల్రెడీ ఆమె హైదరాబాద్ లో పర్యటించారు. ఆ సమయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి  ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.
 

55
Krystyna Pyszkova

ఇదిలా ఉండగా మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఇటు తెలంగాణ ప్రభుత్వం పై అటు నిర్వాహకులపై ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు పోలీసులు ఒకవైపు హైదరాబాద్ నగరానికి భద్రత కల్పిస్తూ మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు కూడా భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Read more Photos on
click me!

Recommended Stories