తొలి సినిమాకే 700 కోట్లా? డైరెక్టర్ గా హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు, సూపర్ హిట్ హృతిక్ రోషన్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఈవిషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు, సూపర్ హిట్ హృతిక్ రోషన్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఈవిషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
చాలా కాలం చర్చల తర్వాత బాలీవుడ్ సూపర్ హీరో మూవీ క్రిష్ 4 మళ్లీ రాబోతోంది. ప్రొడక్షన్, డైరెక్షన్ సమస్యల తర్వాత సినిమాకి డైరెక్టర్ దొరికాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హృతిక్ రోషనే. ఈ సినిమాతో హృతిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. క్రిష్ 4 సినిమాను యాష్ రాజ్ ఫిల్మ్స్, రాకేష్ రోషన్ కలిసి నిర్మిస్తున్నారు.
Also Read: సుహాసిని మణిరత్నం అంత పెద్ద వ్యాధితో బాధపడిందా? రహస్యంగా ఉంచడానికి కారణం ఏంటి?
క్రిష్ 4 సినిమా బడ్జెట్
క్రిష్ 4 సినిమా తీయడానికి ఇప్పటి ప్లాన్ ప్రకారం దాదాపు 700 కోట్ల వరకు ఖర్చు అవుతుందని లేటెస్ట్ న్యూస్. దీనివల్లే చాలా ప్రొడక్షన్ కంపెనీలు ఈ సినిమా తీయడానికి వెనకాడుతున్నాయని బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది. ఇక అన్ని అడ్డంకులు దాటుకుని ఇప్పుడు క్రిష్ 4 స్టార్ట్ కానుంది.
Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
క్రిష్ ఫ్రాంచైజ్
హృతిక్ రోషన్, ప్రీతి జింటా కలిసి 2003లో చేసిన 'కోయి మిల్ గయా' అనే సైన్స్ ఫిక్షన్ సినిమాతో రాకేష్ రోషన్ క్రిష్ సినిమా సిరీస్‌ను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో 2006లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా కలిసి క్రిష్ సినిమా తీశారు. ఆ తర్వాత 2013లో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ మెయిన్ రోల్స్‌లో క్రిష్ 3 వచ్చింది.
Also Read: శివాజీ ఇల్లు నాదే, జప్తు చేయడం కుదరదు, ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్
డైరెక్షన్ చేయబోతున్న హృతిక్ రోషన్
ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ లాస్ట్ మూవీ 'ఫైటర్'. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. అనిల్ కపూర్ కూడా ఫైటర్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఇప్పటివరకు యాక్టర్‌గా అదరగొట్టిన హృతిక్ రోషన్ ఇప్పుడు క్రిష్ 4 సినిమాతో డైరెక్టర్‌గా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?
Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?
Also Read:నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్? క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ