టాలీవుడ్ కు టాటా చెప్పిన కృతీశెట్టి.. అక్కడైనా స్టార్ హీరోయిన్ గా మారుతుందా..?

First Published | Oct 26, 2024, 6:40 PM IST

ఇలా వచ్చి అలా మెరిసి.. వెళ్లిపోయింది హీరోయిన కృతీ శెట్టి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారుతుంది అనకుంటే.. కనిపించకుండా పోయింది. ఇక తెలుగులో అవకాశాలు రావు అనుకుందో ఏంటో.. టాలీవుడ్ కు టాటా చెప్పేసి.. చెన్నై ప్లైట్ ఎక్కేసిందట బ్యూటీ..? 

రీసెంట్ గా కొంత మంది హీరోయిన్లు టాలీవుడ్ లో ఒక ఏడాది కాలంలో ఊపు ఊపేసి వెళ్లిపోతున్నారు. వాళ్ళ ధాటికి ఇతర హీరోయిన్లుకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. సరి వీళ్లైన కొంత కాలం స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలుగుతారంటే.. ఎంత ఫాస్ట్ గా వచ్చారో అంతే  ఫాస్ట్ గా ధుకణం  సర్దేస్తున్నారు. ఈకోవలోకే వచ్చారు కృతి శెట్టి, శ్రీలీల. 

Also Read:  ఎన్టీఆర్ – కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్.. కొడుకుల కోసం కొట్లాడుకున్న స్టార్ హీరోలు..?

ఇక శ్రీలీల అయినా మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్లతో సినిమాలు చేసింది. కాని కృతీ శెట్టి మాత్రం అక్కడి వరకూ కూడా రాలేకపోయింది. టైర్ 2 హీరోల దగ్గరే ఆగిపోయింది. ఉప్పెన సినిమతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చింది.

Also Read: జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసిన అల్లు అర్జున్, ఆ స్టేట్ లో ఐకాన్ స్టార్ దే హవా


దాదాపు వరుసగా అరడజన్ సినిమాలుకు పైగా చేసింది.. కానీఈ స్టార్ డమ్ ను  కనీసం ఏడాది కూడా నిలబెట్టుకోలేక పోయింది. ఫాస్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చిందో.. అందే ఫాస్ట్ గా కనుమరుగు అయ్యింది కృతి శెట్టి.  అందానికి అందంగా.. నటన విషయంలో అద్భుతంగా చేసి చూపించింది కృతి. వరుస అవకాశాలు రావడం.. అద్భుతంగా నటిస్తుండటంతో..  ఈ అమ్మాయికి భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి ఇక తిరుగే లేదని అందరూ అనుకున్నారు. 

Also Read: సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

ఉప్పెన’ తర్వాత చేసిన చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ లాంటి సినిమాలు  కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతీ శెట్టి.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను కూడా మూటగట్టుకుంది.  దీంతో ఈ అమ్మాయికి క్రేజ్ పూర్తిగా పడిపోయింది. 

స్టార్ హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంగతి పక్కన పెడితే, కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కృతి శెట్టి అసలు కనిపించకుండా పోయింది. టాలీవుడ్ లో కృతీ చేసిన చివరి సినిమా మనమే. ఆతరువాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. 

Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే..

అయితే టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వడంలేదు అని కృతీ శెట్టి మలయాళంలో తన లక్ ను పరీక్షించుకుంది.మలయాళం లో ARM అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. దాంతోఅక్కడి నుంచి కూడా ఖాళీ  చేసి చెన్నై చెక్కేసింది బ్యూటీ. తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. 

తమిళం లో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, జయం రవితో ‘జీనీ’, కార్తీ తో ‘వా వాతాయ్’ సినిమాలు చేస్తుంది కృతీ శెట్టి. అయితే  తమిళ ఆడియన్స్ కు బొద్దుగా ఉండే హీరోయిన్లు అంటే ఇష్టం.

Also Read: ఎన్టీఆర్ వల్లే నష్టపోయాం.. కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈటీవి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

హన్సిక కూడా తెలుగులో వర్కౌట్ అవ్వకపోతే.. తమిళ్ లో ఆదరించారు. బొద్దుగా ఉండే కుష్బుకు కూడా అక్కడు ఏకంగా గుడి కట్టారు. జయలలిత కూడా అంతే.. ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను తమళ ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. ఈక్రమంలో కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే కృతీ శెట్టి కూడా అక్కడ స్టార్ గా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చేస్తున్న ఈ మూడు సినిమాలు షఫూటింగ్  దశలో ఉన్నాయి. 

విడుదల అయ్యాక వీటిలో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా కృతి శెట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యినట్టే. ఇవి షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే ఆమెకి హీరోయిన్ గా ఇంకా కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. వాటిట్లో అజిత్ సినిమా కూడా ఉందని సమాచారం. టాలీవుడ్ లో ఎలాగో సక్సెస్ కాలేకపోయింది, ఇప్పుడు కనీసం కోలీవుడ్ లో అయినా ఈమె సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. 

Also Read: ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Latest Videos

click me!