అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోలకు ఆల్మోస్ట్ అనుమతులు లభించినట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వాలు మిడ్ నైట్ షోలకు అనుమతులు ఇస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే మిడ్ నైట్ షోలు రికార్డు స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేవర చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 చిత్రానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రికార్డులు ఇంకా భారీగా ఉంటాయని, పలు రికార్డ్స్ ని బన్నీ మూవీ బ్రేక్ చేయబోతోందని అంచనాలు వినిపిస్తున్నాయి.