అలాంటి సీన్లలో ఇక నటించను, నాని మూవీతో అప్సెట్ అయిన నటి.. తొలి చిత్రం మాత్రమే బ్లాక్ బస్టర్, మిగిలినవన్నీ..

Published : Aug 31, 2025, 06:31 PM IST

కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఉప్పెన తర్వాత కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నానికి జోడీగా నటించింది.

PREV
15

కొన్ని చిత్రాల వల్ల హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అలాంటివి తమ కెరీర్ లో ఇక రిపీట్ కాకూడదని నటీమణులు భావిస్తారు. నేచురల్ స్టార్ నాని నటించిన ఒక ఫ్లాప్ మూవీ వల్ల క్రేజీ హీరోయిన్ అప్సెట్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు తొలి చిత్రంతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన కృతి శెట్టి. 

25

కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యువత ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో కృతి శెట్టి పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఆ తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువెత్తాయి. 

35

ఉప్పెన తర్వాత కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నానికి జోడీగా నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కృతి శెట్టికి ఈ చిత్రం ద్వారా ఒరిగింది ఏమీ లేదు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కాస్తో కూస్తో క్రెడిట్ సాయి పల్లవికి దక్కింది. ఈ మూవీలో సిగరెట్ తాగే సన్నివేశాలు, నానితో ఇంటిమేట్ సీన్లు ఇలా బోల్డ్ గా కృతి శెట్టి నటించింది. 

45

ఆ చిత్రం ఫ్లాప్ అయ్యాక కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించడం తనకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది అని కృతి శెట్టి పేర్కొంది. అలాంటి సీన్లలో జీవితంలో నటించకూడదు అని డిసైడ్ అయినట్లు పేర్కొంది. ఒక వేళ నటించాల్సి వస్తే నాకు కంఫర్టబుల్ గా అనిపిస్తేనే చేస్తాను అని కృతి శెట్టి పేర్కొంది. 

55

ఉప్పెన తర్వాత కృతి శెట్టికి ఏమాత్రం కలిసి రాలేదు.  బంగార్రాజు చిత్రం మాత్రం హిట్ గా నిలిచింది. శ్యామ్ సింగరాయ్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. 

Read more Photos on
click me!

Recommended Stories