బిగ్ బాస్ తెలుగు 9 అప్ డేటెడ్ కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులోకి ఓ మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ రాబోతుందట. ఆమె పేరు బయటకు రావడం షాకిస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రాబోయే కంటెస్టెంట్ల ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. హౌజ్‌లోకి రాబోతున్న కంటెస్టెంట్లు వీరే అని, ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో పలువురు క్రేజీ కంటెస్టెంట్లు, వివాదాస్పద కంటెస్టెంట్లు ఉండటం విశేషం.
25
కంటెస్టెంట్ గా కాంట్రవర్సీ లేడీ కంటెస్టెంట్
అందులో భాగంగా లైంగిక వేధింపుల కేసుకి సంబంధించిన సెలబ్రిటీ బిగ్ బాస్ కి రాబోతుందట. అది లేడీ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ గా రాబోతుండటం విశేషం. అది ఎవరో కాదు, డాన్స్ మాస్టర్ శ్రష్టి వర్మ. ఆమె జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. చాలా కాలంగా తనని వేధిస్తున్నారని చెప్పి ఆమె కేసు పెట్టగా, ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.
35
శ్రష్టి వర్మతో అగ్రిమెంట్ కూడా పూర్తి
శ్రష్టి వర్మ.. జానీ మాస్టర్ శిష్యురాలు. చాలా రోజులుగా ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ వేధించాడని ఆరోపించింది. ఈ కేసు కోర్ట్ లో ఉంది. అయితే శ్రష్టి వర్మ.. `పుష్ప2` సినిమాలో కొరియోగ్రఫీ చేసింది. జానీ మాస్టర్‌ని తప్పించడంతో ఆయన స్థానంలో శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ చేసిందని సమాచారం. ఈ విషయంలో వివాదాల్లో నిలిచిన శ్రష్టి వర్మ ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారని, అగ్రిమెంట్ కూడా అయ్యిందని సమాచారం.
బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి ఎక్కువగా వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శ్రష్టి వర్మని ఎంపిక చేసినట్ట సమాచారం. మరోవైపు అలేఖ్య చిట్టి పికిల్స్ కి చెందిన అమ్మాయి రమ్యని కూడా ఓకే చేశారట. ఆమె ఆల్‌రెడీ కన్ఫమ్ అయ్యిందట. వీరితోపాటు టీవీ ఆర్టిస్ట్ లు దేబ్జానీ, దీపికా, శివ కుమార్, ఇమ్మాన్యుయెల్, హీరో సుధాకర్ కోమాకుల, తనూజ పుట్టుస్వామి, ఆశా షైనీ, నాగదుర్గ, బంచీక్ బబ్లూ, తేజస్విని గౌడ, సుమంత్ అశ్విన్ హౌజ్‌లోకి రాబోతున్నారు. వీరితోపాటు ఐదుగురు కామనర్స్ రాబోతున్నారు. కామనర్స్ కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జరుగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న వీరు ఫైనల్ అవుతారు.
55
18 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ షో ప్రారంభం
ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 13 మంది ఆర్టిస్ట్ ల నుంచి, ఐదుగురు కామనర్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరితోపాటు మరో నలుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని, ఇది నాల్గో వారంలోగానీ, ఐదో వారంలోగానీ ఉండబోతుందని సమాచారం. మొత్తానికి ఈ సారి చాలా వరకు తెలిసిన ఫేస్‌లే హౌజ్‌లోకి వస్తున్నారట. అదే సమయంలో గేమ్స్, టాస్క్ లు కూడా క్రేజీగా ప్లాన్ చేశారట. టీఆర్‌పీ రేటింగ్ పెంచేందుకు ట్విస్ట్ లు, టర్న్ లు ప్లాన్ చేసినట్టు టాక్. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న `బిగ్ బాస్ తెలుగు 9` సెప్టెంబర్ 7న ప్రారంభం కాబోతుంది.