
తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిరాయ్. ఈ పాన్ ఇండియా మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు మనోజ్ కీలక పాత్రలో నటించగా, ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, పోస్టర్లు, మోషన్ కంటెంట్ వరుసగా రిలీజ్ అవుతూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రత్యేకంగా విజువల్ ప్రెజెంటేషన్, హై ఆక్షన్ సీన్స్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిరాయ్‌కు అదనపు హైప్ ఇచ్చాయి. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోయే మిరాయ్, టాలీవుడ్‌లో ఈ నెల మొదటి క్రేజీ రిలీజ్‌గా చెప్పుకోవచ్చు. ఆడియెన్స్, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టింది.
అనుష్క శెట్టి కంబ్యాక్ మూవీగా వస్తోన్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌కు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి గంజాయి స్మగ్లర్‌గా నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ – ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో జాగపతి బాబు, విక్రమ్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు.
కిష్కింధపురి : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందించబడింది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీ మేకర్స్ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేడియో స్టేషన్ నేపథ్యంపై సాగే కథగా ఇది ఆడియన్స్‌లో మంచి ఆసక్తి రేపుతోంది.
‘‘తలకిందులుగా తపస్సు చేసినా, కాత్యాయనిలాంటి అమ్మాయి నాకు దొరకదు’’ అంటూ ప్రేమికుడు తాము చేసే ప్రయత్నాల కథ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ETV Win ఒరిజినల్ ప్రొడక్షన్‌లో రూపొందింది. మౌళి తనూజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు సాయి దర్శకత్వం వహించారు. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి ద్వారా ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. తరువాత ETV Winలో స్ట్రీమింగ్ కానుంది.
Vijay Antony’s ‘Bhadrakali’: తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ హీరోగా, అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భద్రకాళి. తమిళంలో ఈ సినిమా ‘శక్తి తిరుమగన్’ పేరుతో, తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో విడుదల కానుంది. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతూ, రూ. 190 కోట్ల కుంభకోణం చుట్టూ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దబడిన భద్రకాళి, విజయ్ ఆంటోనీకి డిఫరెంట్ షేడ్స్‌లోని పాత్రను అందిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ ప్రేయసి పాత్రలో నటిస్తున్న సినిమా ఓజీ. పాన్-ఇండియా పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కింది ఓజీ. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాను కళ్యాణ్ దాసరి, డీవీవీ దానయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘They Call Him OG’ అనే టైటిల్‌తో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వబోతోందని తొలుత ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.
మొత్తానికి సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మిరాయ్, ఘాటీ, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్, భద్రకాళి, ఓజీ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఏవీ సాలిడ్ హిట్స్ అవుతాయో, బాక్సాఫీస్ కలెక్షన్లను కాపాడుతాయో చూడాలి.