రియల్ లైఫ్ లో నటించకూడదు.. చిరంజీవిలో నాకు నచ్చేది అదే, కాస్ట్లీ గిఫ్ట్ పై కృష్ణం రాజు కామెంట్స్

Published : Jun 24, 2025, 08:06 AM IST

కృష్ణంరాజు చిరంజీవి కలిసి మన ఊరి పాండవులు, పులి బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ నుంచి తాను నేర్చుకున్న ఒక విషయాన్ని రివీల్ చేశారు.

PREV
16
చిరంజీవి, కృష్ణం రాజు స్నేహం 

మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ కృష్ణంరాజు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ మొగల్తూరుకి చెందిన వాళ్లే. చిరంజీవి కంటే ముందే కృష్ణంరాజు ఇండస్ట్రీకి వెళ్లి రాణించారు. ఆ తర్వాత చిరంజీవి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కృష్ణంరాజు చాలా ఎంకరేజ్ చేశారట. నీ డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి అని అభినందించే వారట.

26
రియల్ లైఫ్ లో నటించకూడదు 

కృష్ణంరాజు చిరంజీవి కలిసి మన ఊరి పాండవులు, పులి బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ నుంచి తాను నేర్చుకున్న ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఎవరైనా సరే కెమెరా ముందు మాత్రమే నటించాలి. నిజజీవితంలో నటించకూడదు. అలా రియల్ లైఫ్ లో కూడా నటించే వాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. సినిమాల్లో నటిస్తున్నాం కదా అని బయట కూడా మెప్పుకోసం పొగడడం, అబద్ధాలు చెబుతూ నటించడం లాంటివి చేస్తే నాకు నచ్చదని కృష్ణంరాజు అన్నారు.

36
ఫొటోగ్రఫీపై ఇష్టం 

నటన కాకుండా తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అని కృష్ణంరాజు తెలిపారు. సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండేది. కానీ నటుడిగా బిజీ అయ్యాక ఫోటోగ్రఫీపై అంతగా ఫోకస్ పెట్టలేదు. కానీ అప్పుడప్పుడు ప్రయత్నించే వాడిని. నా దగ్గర ఓల్డ్ కెమెరాల కలెక్షన్ చాలా ఉందని కృష్ణంరాజు తెలిపారు.

ఒకసారి లండన్ లో చాలా కాస్ట్లీ కెమెరా కొన్నాను. లైట్ ని అదే అడ్జస్ట్ చేసుకొని ఫోటోలు తీయగలదు. ఒకసారి చిరంజీవి బర్త్ డే పార్టీ జరుగుతుంటే ఆ కెమెరా తీసుకుని వెళ్లాను. చిరంజీవి ఆ కెమెరా చూడగానే.. అన్నయ్య ఎక్కడ కొన్నావ్ ఈ కెమెరా.. ఇది చాలా కాస్ట్లీ కదా, నేను లండన్ లో చూశాను. అంత కాస్ట్ ఎందుకులే అని కొనలేదు అని చిరంజీవి ఆశ్చర్యపోతూ చెప్పారు.

46
చిరంజీవికి కాస్ట్లీ గిఫ్ట్

నేను వెంటనే ఆ కెమెరా తీసి చిరంజీవి మెడలో వేశాను. నీ బర్త్ డే కి ఇదే నా గిఫ్ట్ అని చెప్పాను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాను. చిరంజీవి ఇండస్ట్రీలో వచ్చిన కొత్తల్లో కూడా.. అతడి డ్యాన్స్, హుషారు చూసి నువ్వు పైకి వస్తావ్ తమ్ముడు అని చెప్పేవాడిని.

చిరంజీవి మంచి స్నేహితుడు. ఎవరికి హాని తల్లి పెట్టాలని అనుకోకూడదు. చిరంజీవిలో నాకు నచ్చేది అదే అని కృష్ణంరాజు అన్నారు.కృష్ణం రాజు 2022లో అనారోగ్య కారణాలతో మరణించారు. కృష్ణం రాజు నటించిన చివరి చిత్రం రాధే శ్యామ్. ఈ మూవీలో కృష్ణం రాజు ప్రభాస్ తో కలసి నటించారు. అంతకు ముందు కృష్ణం రాజు, ప్రభాస్ బిల్లా, రెబల్ లాంటి చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. 

56
రాజకీయాల్లో కృష్ణంరాజు 

కృష్ణం రాజు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. 1999 లో బీజేపీ తరుపున ఎంపీగా విజయం సాధించి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు.కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయితో స్నేహబంధం ఏర్పడింది. అప్పటి నేషనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. తన సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణా మూవీస్ ద్వారా అనేక సినిమాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో విలన్‌గా ప్రవేశించి తరువాత హీరోగా రాణించిన అరుదైన నటుల్లో కృష్ణంరాజు ఒకరు.

66
కెరీర్ లో ఊహించని మలుపులు 

కృష్ణంరాజు కెరీర్ లో సంచలన చిత్రాల్లో భక్త కన్నప్ప ఒకటి. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సోదరుడు, ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మించారు. అఖండ విజయం సాధించిన ఈ చిత్రం జాతీయ అవార్డు కూడా అందుకుంది. వాణిశ్రీ, జయసుధ తనకి ఇష్టమైన హీరోయిన్లు అని కృష్ణం రాజు తెలిపారు. తాను హీరో కావడం అనేది యాక్సిడెంటల్ గా జరిగింది అని కృష్ణం రాజు తెలిపారు. ఓ చిత్రంలో జమునతో నటించే హీరోలు దొరకకపోవడంతో తనని హీరోగా ఎంపిక చేశారని కృష్ణం రాజు తెలిపారు.  కృష్ణంరాజు తొలిసారి నిర్మాతగా మారి నటించిన చిత్రం కృష్ణవేణి. అది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. దీనితో అంతా నా పని అయిపోయింది అని కామెంట్స్ చేశారు. కానీ ఆ చిత్రం మంచి విజయం సాధించింది అని కృష్ణంరాజు పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories