మహేష్ బాబు కెరీర్ కీలక దశలో ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు తలెత్తాయి. అసలు మహేష్ బాబు స్టార్ హీరో కాగలడా అనే సందేహాలు మొదలైనట్లు ఓ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో హీరోగా లాంచ్ చేశారు. రాజకుమారుడు మూవీ మంచి హిట్ అయింది. అంతకు ముందే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాల్లో బాల నటుడిగా నటించారు. కానీ హీరోగా కెరీర్ మొదలు పెట్టింది మాత్రం రాజకుమారుడు చిత్రంతోనే.
25
వరుసగా మహేష్ కి ఫ్లాపులు
రాజకుమారుడు తర్వాత మహేష్ బాబుకి వరుస ఫ్లాపులు పడ్డాయి. యువరాజు, వంశీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఫ్లాపులు ఎదురైతే సహజంగానే ఇండస్ట్రీలో సందేహాలు మొదలవుతాయి. వంశీ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు మురారి చిత్రం ప్రారంభం అయింది. ఆల్రెడీ రెండు ఫ్లాపులు పడ్డాయి కాబట్టి తన కొడుకు సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ ఫోకస్ పెట్టారు.
35
పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు
కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత మహేష్ చేస్తున్న సినిమా అది. ఆ సమయంలో మహేష్ బాబు గుర్తింపు పైనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ మంచి జోరు మీద ఉన్నాడు. హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. పవన్, మహేష్ మధ్య కాంపిటీషన్ అనే చర్చ అప్పటికే ఇండస్ట్రీలో మొదలైంది. మహేష్ కి ఫ్లాపులు రావడంతో రేసులో వెనుకబడ్డాడు.
ఆ టైంలో మురారి సినిమాని నేను టేకప్ చేశాను. ఆ మూవీలో క్లైమాక్స్ సాంగ్ గా అలనాటి రామచంద్రుడు అనే పాట అనుకున్నాను. కానీ అందరూ షాక్ అవుతున్నారు. మహేష్ బాబు లాంటి హీరోకి క్లైమాక్స్ లో మాస్ సాంగ్ ఉండాలి కదా. కృష్ణ వంశీ ఏంటి చెడగొడుతున్నారు అని నా పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు.
55
సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి పంచాయతీ
విషయం సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఆయన నన్ను పిలిచి అడిగారు. క్లైమాక్స్ లో మాస్ సాంగ్ ఎందుకు పెట్టడం లేదు అని అడిగారు. అలనాటి రామచంద్రుడు అనే పాటే ఈ సినిమాకి కరెక్ట్. నాకు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ పాటని కొన్ని తరాల పాటు గుర్తుంటుంది. ఆ పాటని తీసేసి మాస్ సాంగ్ పెట్టమంటే నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను. మీరు మాస్ సాంగ్ ని షూట్ చేయించుకుని నా పేరు వాడకుండా సినిమా రిలీజ్ చేసుకోండి అని తేల్చి చెప్పేశా. దీనితో కృష్ణ గారు డెసిషన్ నాకే వదిలేశారు అని కృష్ణ వంశీ తెలిపారు. ఆ తర్వాత సినిమాకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.