Keerthy Bhat: డబ్బున్నవాడు దొరకగానే నన్ను వదిలేసింది.. కీర్తీ భట్ పై బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్

Published : Jan 29, 2026, 05:42 PM IST

 Keerthy Bhat:టీవీ సీరియల్ నటి కీర్తి భట్ రీసెంట్ గా తన బ్రేకప్ విషయాన్ని ప్రకటించింది. అయితే, తాను పెళ్లి చేసుకుందామని అనుకున్నా కూడా కీర్తినే తనను వదిలేసిందంటూ ఆమె బాయ్ ఫ్రెండ్ కార్తీక్ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. 

PREV
13
Keerthy Bhat

టీవీ సీరియల్ నటి కీర్తి భట్ కి పరిచయం అవసరం లేదు. మనసిచ్చి చూడు, కార్తీకదీపం వంటి సీరియల్స్ తో చాలా పాపులర్ అయ్యింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా ఆమె అడుగుపెట్టారు. ఆ సీజన్ లో కీర్తి టాప్ 3 వరకు వచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే నటుడు, డైరెక్టర్ విజయ్ కార్తీక్ తో తన ప్రేమ విషయాన్ని ప్రకటించారు. వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.చాలా టీవీ షోలకు ఇద్దరూ జంటగా కూడా వచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనగా.. సడెన్ గా ఇద్దరం మ్యూచువల్ గా విడిపోయాం అంటూ కీర్తి తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాకిచ్చింది.

23
ప్రియుడితో బ్రేకప్..

కీర్తి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. ఆమె జీవిత కథ ద్వారా ఎక్కువ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్ ద్వారా కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి.. పిల్లలను కనే సామర్థ్యాన్ని కూడా అదే ప్రమాదంలో కోల్పోయింది. ఎవరూ లేకుండా మిగిలిన తనకు బంధువులు కూడా సహాయం చేయలేదని.. తాను ఒంటరిగా.. ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని కీర్తి చెప్పేది. తనకు పిల్లలు పుట్టరు అని తెలిసి కూడా.. కార్తీక్ తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని... తానే స్వయంగా చెప్పింది. సడెన్ గా ఇప్పుడు విడిపోయాం అని చెప్పగానే.. ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కీర్తి వదిలేయకండి ప్లీజ్ అంటూ కార్తీక్ కి మెసేజ్ లు చేస్తున్నారు. దీంతో.. కార్తీక్ ఈ విషయంపై ఓ వీడియో విడుదల చేశారు.

33
నా దగ్గర డబ్బు లేదని వదిలేసింది.. కార్తీక్..

‘ నేను ఈ వీడియో చేయాలని అనుకోలేదు.. కానీ నిన్న కీర్తి గారు మేం పరస్పర నిర్ణయంతో విడిపోతున్నాం అని మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి అందరూ నాకు మెసేజ్ లు చేస్తున్నారు. ప్లీజ్ మీరు కీర్తిని వదిలేయకండి.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని నాకు చెబుతున్నారు. కానీ.. నిజం ఏంటంటే.. నాకు తనతో విడిపోవాలని లేదు. నాకు తనను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనే అనుకున్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు విడిపోవాలని అనుకుంటాను. అది కేవలం తన నిర్ణయం మాత్రమే.. నేను ఇంకా ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాలేదని.. తాను ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ లోనే తను నాకు ఈ విషయం చెప్పింది. తన జీవితం ఎలా ఉండాలి అనుకుంటుందో నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉంటుంది. ఆమె ఆల్రెడీ తన కొత్త జీవితం మొదలుపెట్టింది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ.. తను ఒప్పుకోలేదు. కాంప్రమైజ్ అయ్యి బతకడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆల్రెడీ తనకు బెటర్ ఆప్షన్ దొరికారు. వదిలేస్తే.. తాను హ్యాపీగా కొత్త లైఫ్ బతుకుతాను అని క్లియర్ గా చెప్పింది. తాను ఎక్కడున్నా.. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కీర్తి నా ఫోటోలు డిలీట్ చేసింది.. నేను మాత్రం డిలీట్ చేయలేదు అని చాలా మంది అడుగుతున్నారు.. ప్రతి ఫోటోకి ఒక ఎమోషన్ ఉంటుంది.. అందుకే డిలీట్ చేయలేకపోయాను. కీర్తి తనకు దొరికిన కొత్త కంపానియన్ తో సంతోషంగా ఉండాలని నేను కూడా అయ్యప్పను కోరుకుంటున్నాను’ అని కార్తీక్ తన వీడియోలో చెప్పాడు.దీంతో. కీర్తి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ.. చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories