Hansika Motwani : డైట్ చేయకుండానే ఇంత ఫిట్‌గా ఎలా? సీక్రెట్ బయటపడిందిగా..

Published : Jan 29, 2026, 04:30 PM IST

హీరోయిన్  హన్సిక మోత్వాని ఎవరు ఊహించని విధంగా  చాలా బరువు తగ్గింది. కానీ, తాను ఎలాంటి డైట్ పాటించనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో స్టార్ హీరోయిన్ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? 

PREV
15
హన్సిక మోత్వాని డైట్ టిప్స్..

 ఒకప్పటి స్టార్  హీరోయిన్  హన్సిక చాలా వెయిట్ తగ్గి.. అందరిని ఆశ్చర్చ పరిచింది.  'నేను డైట్ చేయను' అని చెప్పింది. కానీ, ఆమెకు ఇలా ఫిట్‌ గా ఉండటం ఎలా సాధ్యమయ్యిందన్న డౌట్ ప్రతీ ఒక్కరిలో వస్తోంది. ఈ విషయంపై కూడా హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు బరువు పెరగడం, తగ్గడం సాధారణంగా మారింది. గ్లామర్ పరంగా ఎక్కువ బరువు ఉండటం మంచిది కాదని కొందరి అభిప్రాయం. రకరకాల పద్ధతులు ఉపయోగించి తారలు సన్నబడుతుంటారు.

25
డైట్ చేయనని షాక్ ఇచ్చిన హన్సిక..

హన్సిక చాలా బరువు తగ్గింది.  అందుకోసం ఆమె ఏం చేసిందన్న విషయం రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను  డైట్ చేయనని చెప్పి ఆశ్చర్యపరిచింది హన్సిక. ఇటీవల ఫరా ఖాన్ ఆమెను ఇంటర్వ్యూ చేయగా, "నేను డైట్‌లో లేను మేడమ్" అని హన్సిక చెప్పడంతో ఆ రహస్యం బయటపడింది.

35
డైట్ లేకుండా ఎలా సాధ్యం..

డైట్ లేకుండా బరువు తగ్గడం ఎలా సాధ్యమని ఫరా ఖాన్ అడిగింది. దానికి హన్సిక గర్వంగా "నేను పైలేట్స్ అమ్మాయిని" అని సమాధానం ఇచ్చింది. అందుకే అంత ఫిట్‌గా ఉన్నానని చెప్పింది.

అసలు పైలేట్స్ అంటే ..?

పైలేట్స్ అనేది బలం, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ మెరుగుపరచడానికి రూపొందించిన వ్యాయామం. ఇది పొత్తికడుపు, కటి, వెనుక కండరాలను బలపరుస్తుంది.

45
వెయిట్ ట్రైనింగ్ చాలా కష్టం..

గత ఇంటర్వ్యూలలో హన్సిక 'వెయిట్ ట్రైనింగ్ నాకు కష్టం, మొత్తం శరీరాన్ని కదిలించే వ్యాయామాలకు ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తాను' అని చెప్పింది. రోజూ స్విమ్మింగ్, డ్యాన్స్, యోగా చేస్తానని తెలిపింది.అనవసర కేలరీల కంటే ఎక్కువ కొవ్వును శరీరం నిల్వ చేసినప్పుడు లావుగా కనిపిస్తాం. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లున్న ఆహారం బరువు తగ్గిస్తాయి. ఈ కాన్సెప్ట్ ను హన్సిక ఫాలో అవుతోంది. 

55
హన్సిక సీక్రెట్..

హన్సిక చెప్పిన వివరాల  ప్రకారం, బరువు తగ్గడంతో పాటు దాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం. అందుకే ఆమె ఇప్పుడు తన బరువును మేనేజ్ చేస్తోంది. దీనికి కఠినమైన డైట్ అవసరం లేదు. పైలేట్స్ అనే సీక్రెట్ ట్రిక్ ఫాలో అయితే చాలు అని.. హన్సిక సీక్రేట్  బయటపడింది. ఇక, హన్సిక ప్రస్తుతం  గాంధారి సినిమా చేస్తోంది. ఈ ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ సినిమాలో స్టార్ హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేస్తోంది.  ఆర్. కన్నన్ దర్శకత్వం లో ఈమూవీ తెరకెక్కుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories