నందినిని అమెరికాకి పంపిస్తున్న విషయం చెప్తుంది రేవతి. ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ.ఈ విషయంలో నిన్ను జోక్యం చేసుకోవద్దు అంటున్నారు అని రేవతి చెప్పడంతో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది అంటాడు మురారి. అసలు విషయం మీ ఆయనకు చెప్పలేదా అంటుంది రేవతి. ఎంతైనా మగాడు కదా, ముందే అపార్థం చేసుకున్నారు అందుకే ఏమీ చెప్పలేదు అంటుంది కృష్ణ.