చీరకట్టులో పద్ధతిగా మెరిసిన నిధి అగర్వాల్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు.. బ్యూటీఫుల్ పిక్స్

First Published | Apr 4, 2023, 1:24 PM IST

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చీరకట్టులో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. చీరకట్టులో బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

హైదరాబాద్ కు చెందిన హీరోయిన్ నిధి అగర్వాల్  తొలుత హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’తో హీరోయిన్ గా కేరీర్ ను ప్రారంభించింది. డాన్స్, నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది. వెంటనే అక్కినేని నాగచైతన్య సరసన ‘సావ్యసాచీ’లో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. 
 

అప్పటి నుంచి వరుసగా తెలుగులో అవకాశాలను అందుకుంటోంది. ఈక్రమంలోనే ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ సక్సెస్ ను అందుకుంది. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. చివరిగా ‘హీరో’ చిత్రంతో మెరిసింది. 
 


ఇటు సినిమాలతో అలరిస్తూనే ఉన్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు సందడి చేస్తూనే ఉంటోంది. తన బ్యూటీపుల్ ఫొటోషూట్లను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

తాజాగా ఫొటోల్లో నిధి అగర్వాల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో మెరిసిపోతోంది. శారీలో హోయలు పోతూ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. తెలుగు బ్యూటీని సంప్రదాయ దుస్తుల్లో చూసిన అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తున్న నిధి అగర్వాల్ మరోవైపు గ్లామర్ విందుతోనూ మైమరిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. చురకత్తుల్లాంటి చూపులతో మతులు పోగొట్టింది. తన రూపసౌందర్యంతో చూపుతిప్పుకోనివ్వలేదు.
 

ప్రస్తుతం నిధి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)లో నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తొలిసారిగా ఆడిపాడుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  

Latest Videos

click me!