సూపర్ స్టార్ కృష్ణ కు ఆడిషన్ లో పోటీ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Sep 20, 2025, 01:05 PM IST

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ఎన్ని రికార్డులు బ్రేక్ చేశాడో అందరికి తెలిసిందే. ఆయన మొదటి సినిమా తేనె మనసులు కోసం ఆడిషన్ కు వెళ్లి సెలక్ట్ అయ్యారు కృష్ణ. అయితే ఆ ఆడిషన్ కు వచ్చి ఫెయిల్ అయిన మరో హీరో ఎవరో తెలుసా? 

PREV
14
టాలీవుడ్ సూపర్ స్టార్

టాలీవుడ్ కు ఎవర్ గ్రీన సూపర్ స్టార్ అంటే కృష్ణనే. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి 18 సినిమాలు చేసిన ఘన కృష్ణ సొంతం. కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు. 16 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ హీరో కృష్ణ. అంతే కాదు దాదాపు 80కిపైగా హీరోయిన్లతో నటించిన రికార్డు కూడా కృష్ణదే. విజయనిర్మలతో 48, జయప్రదతో 47, శ్రీదేవితో 31, రాధతో కలిసి 23 సినిమాల్లో జంటగా నటించారు సూపర్ స్టార్. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన అరుదైన రికార్డు కూడా కృష్ణపేరునే ఉంది. అంతే కాదు టాలీవుడ్ లో ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులతో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో కృష్ణ నటించారు.

24
రికార్డుల రారాజు

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది. ఆయన పరిచయం చేసిన టెక్నాలజీ, సినిమాల్లో ప్రయోగాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్‌గా చూస్తే తొలి కలర్ సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R/O టెక్నాలజీ సినిమాలు అన్నీ కృష్ణ పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు కూడా కృష్ణ హీరోగానే చేశారు. సినిమాల్లో కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ ఖాతాలోనే ఉంది. ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన రికార్డ్ కూడా కృష్ణదే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన సినిమాలగురించి ఎన్నోచెప్పవచ్చు.

34
తేన మనసులు మొదటి సినిమా

కృష్ణ మొదటి సినిమా తేనెమనసులు. ఈ సినిమాకు దర్శకుడు ఆదరుర్తి సుబ్బారావు. ఈసినిమాకోసం కృష్ణ ఫోటోలు పంపించారు. అప్పుడు హీరోను సెలక్ట్ చేసే న్యాయనిర్ణేతల గ్రూప్ లో ఆదుర్తి సుబ్బారావు తో పాటు అప్పటికే స్టార్ హీరో అయిన ఏఎన్నార్ కూడా ఉన్నారు. ఆదుర్తి ఏఎన్నార్ సలహాలు తీసుకున్నారు. ఈసినిమా కోసం చాలా ఫోటోలు వచ్చాయి. కాని అందరిలో అక్కినేని కృష్ణనే సెలక్ట్ చేశారు. ఈ రకంగా అక్కినేని నాగేశ్వరావు వల్లే కృష్ణ తేనెమనసులు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్నిసూపర్ స్టార్ కృష్ణ అక్కినేని 75 సంవత్సరాలు సినిమా వేడుకల్లో వెల్లడించారు. అప్పుడు తనను హీరోగా సెలక్ట్ చేసింనందుకు అక్కినేనికి కృతజ్ఞతలు కూడా చెప్పారు.

44
కృష్ణకు పోటీ ఇచ్చిన కృష్ణంరాజు

అయితే కృష్ణ తేనెమనసులు ఆడిషన్స్ కు వచ్చినప్పుడు ఆయనకు కాంపిటేషన్ గా కృష్ణ రాజు కూడా వచ్చారట. తేనెమనసలు ఆడిషన్ లో కృష్ణంరాజు సెలెక్ట్ అవ్వలేదు. కాని కృష్ణతో పరిచయం మాత్రం ఏర్పడింది. ఆతరువాత రోజుల్లో కృష్ణంరాజు విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టి.. హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ విషయాన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆతరువాత ఈ ఇద్దరు హీరోల మధ్య అనుబంధం కూడా పెరిగి బలపడింది. తేనెమనసులు సినిమాకు కృష్ణ సెలక్ట్ అవ్వకపోయిఉంటే, అందులో కృష్ణంరాజు హీరోగా నటించే వారు.

Read more Photos on
click me!

Recommended Stories