మంచు మనోజ్ లైఫ్ ని పవన్ కళ్యాణ్ ఎలా మార్చేశారో తెలుసా, ఒక్క మాటతో బ్లాక్ బస్టర్ మూవీ

Published : Sep 20, 2025, 01:04 PM IST

మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ చిత్రం మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మంచు మనోజ్ కి చాలా ఏళ్ళ తర్వాత మంచి విజయం దక్కింది. దీని వెనుక ఒక స్టార్ హీరో ప్రమేయం ఉందని మనోజ్ తెలిపారు. 

PREV
15
మంచు మనోజ్ 8 ఏళ్ళ గ్యాప్

మంచు మనోజ్ దాదాపు 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి నటించడం ప్రారంభించారు. ఈ ఏడాది మంచు మనోజ్ నుంచి భైరవం, మిరాయ్ చిత్రాలు వచ్చాయి. భైరవం మూవీ నిరాశపరిచింది. కానీ రీసెంట్ గా విడుదలైన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. మంచు మనోజ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ మిరాయ్ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. 

25
దూసుకుపోతున్న మిరాయ్ 

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ మూవీ 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. సూపర్ హీరో కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో తేజ సజ్జా, మంచు మనోజ్ పెర్ఫార్మెన్స్ లు, గ్రాఫిక్స్ ఆడియన్స్ ని అబ్బుర పరిచాయి. ఈ చిత్రంతో మంచు మనోజ్ కి మంచి గుర్తింపు లభించింది. మిరాయ్ మూవీలో మంచు మనోజ్ డైలాగ్ డెలివరీ, డిఫెరెంట్ స్టైల్ లో నటన ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి అందించాయి. 

35
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సలహా 

మిరాయ్ చిత్రంతో తనకి ఇంతపెద్ద సక్సెస్ రావడం వెనుక ఒక బడా స్టార్ హస్తం ఉందని మంచు మనోజ్ తెలిపారు. ఆ స్టార్ హీరోయిన్ ఇచ్చిన సలహాతోనే తాను మిరాయ్ మూవీలో విలన్ గా నటించేందుకు అంగీకరించినట్లు మంచు మనోజ్ తెలిపారు. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని చాలా సార్లు కలిశాను. ప్రతిసారి ఆయన నాకు ఒక మాట చెప్పేవారు. నువ్వు విలన్ గా నటిస్తే చూడాలని ఉంది అని చెప్పారు. నువ్వు నెగిటివ్ షేడ్స్ లో నటిస్తే చాలా బావుంటుంది. 

45
మిరాయ్ లో నటించింది అందుకే 

ఒక్కసారి విలన్ గా ట్రై చేసి చూడు.. నీకు సక్సెస్ రావడం మాత్రమే కాదు.. అవకాశాలు క్యూ కడతాయి అని చెప్పారు. అందుకే మిరాయ్ లో నటించడానికి అంగీకరించాను. కట్ చేస్తే ఇంత మంచి గుర్తింపు దక్కింది అని మంచు మనోజ్ తెలిపారు. 

55
మిరాయ్ కలెక్షన్స్ 

మిరాయ్ చిత్రం ఇప్పటికే 100 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది. షేర్ వాల్యూ 60 కోట్ల వరకు ఉంది. ఈ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు. శ్రీయ శరన్ కీలక పాత్రలో నటించింది. మిరాయ్ చిత్రంతో తన జీవితంలో కొత్త మలుపు చోటు చేసుకుంది అని మంచు మనోజ్ అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories