Sobhan Babu and Balakrishna : జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర రికార్డులు తిరగరాయాలనే ఉద్దేశంతో శోభన్ బాబు, బాలకృష్ణ కాంబోలో ఒక చిత్రం వచ్చింది. ఆ మూవీ రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఎప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఒక దృశ్య కావ్యంలా నిలిచిపోతుంది. దర్శకుడు రాఘవేంద్ర రావు అంతటి అద్భుతంగా ఆ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవి, శ్రీదేవి జంట పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు తిరగరాసింది.
25
బాలయ్య, శోభన్ బాబు కాంబినేషన్
అశ్విని దత్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మించే సినిమా చేయాలని పాన్ చేశారు. వెంటనే మరోసారి రాఘవేంద్ర రావు దర్శకుడిగా కొత్త ప్రాజెక్టు సెట్ చేయించుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత వైజయంతి బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అశ్విని దత్ బడ్జెట్ కి వెనుకాడలేదు. ఈ చిత్రం వైవిధ్యంగా ఉండాలని నందమూరి బాలకృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అయింది.
35
రికార్డులు తిరగరాస్తుంది అనే అంచనాలు
జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత అశ్విని దత్ నిర్మిస్తున్న చిత్రం.. పైగా రాఘవేంద్ర రావు, బాలకృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్.. దీనితో టాలీవుడ్ రికార్డులు తిరగరాసే చిత్రం అవుతుందని అంతా భావించారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అశ్వమేథం. 1992లో ఈ చిత్రం విడుదలయింది. మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి పెట్టిన బడ్జెట్ 2 కోట్లు. అశ్వమేథం చిత్రం కోసం అశ్విని దత్ 3 కోట్లు ఖర్చు చేశారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో కలెక్షన్స్ కి డోకా ఉండదనేది అశ్విని దత్ నమ్మకం. ఆయన ఆశించినట్లుగానే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
55
డిజాస్టర్ అయిన అశ్వమేథం
కానీ సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఫలితంగా అశ్విని దత్ కి నష్టాలు తప్పలేదు. అశ్వమేథం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బాలయ్య, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం ఇదే.