కోవై సరళ..ఎంజీఆర్ పై అభిమానంతో సినిమాల్లోకి వచ్చింది. ఆమె `వెళ్లి రతం` అనే మూవీతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులోనూ వందకుపైగా చిత్రాల్లో నటించింది. `భైరవ ద్వీపం`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`, `పెళ్లి`, `సుప్రభాతం`, `క్షేమంగా వెళ్లి లాభంగా రండి`, `నువ్వే కావాలి`, `తిరుమల తిరుపతి వెంకటేశా`, `సింహారాశి`, `సందడే సందడి`, `టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్`, `మహానంది`, `వీరభద్ర`, `స్టైల్`, `దేశముదురు`, `నేనింతే`, `రెబల్`, `టెంపర్` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా `సీతా పయణం` చిత్రంలో మెరిసింది.