కోటా శ్రీనివాసరావు.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వయస్సు మీద పడటంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.. ఇప్పటికి నేను నటిస్తానంటున్నారు.. అవకాశం ఇస్తే చాలు ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తానంటున్నాడు కోటా. నటనను అంతలా ప్రేమిస్తారు కోటా శ్రీనివాసరావు. నటనలో శిఖరాలను చూసిన కోటాకు.. ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది. ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది..?
All So Read: రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?
కోట శ్రీనివాసరావు ఈ పేరు వింటేనే తెలుగు సినిమాకు కొత్తగా విలనిజాన్ని.. హాస్యాన్ని.. ఒక రకంగా చెప్పచెప్పాలంటే నవరసాలను కొత్తగా చూపించాడు కోటా. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా.. కామెడీ విలన్ గా.. కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ఆయన డైలాగ్ డెలీవరి, నటన, ఫేస్ ఎక్స ప్రెషన్స్, ఇలా చెప్పుకుంటూపోతే.. ప్రతీది అద్భుతమే. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టయిల్‌ను.. సరికొత్త మ్యానరిజమ్స్ ను నేర్పించిన కోటా.. ఇంత స్టార్ గా ఎలా మారాడు.. ఆయన్ను స్టార్ ను చేసిన సినిమా ఏది...?
All So Read: పెద్ద సినిమా పెద్ద సినిమా అన్నాడు.. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. ప్రభాస్ అలా అన్నాడేంటి..?
Kota Srinivasa rao
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి శాలరీ.. కాని నటనమీద ప్రేమ ఆయన్ను స్టేజ్ ఎక్కించింది. స్టేజీపై నాటకాలు వేస్తూ.. అందులోనే తన సంతోషాన్ని వెదుకున్న కోటా.. అలా . అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమాలోకి ఎంటర్ అయ్యారు. సినిమాలు పెరిగాయి.. బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు.. దాంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ..తన టాలెంట్ చూపించిన కోటా.. తన నటనతో మేకర్స్ ను మంత్ర ముగ్ధులను చేసి.. అంవకాశాలు సాధించాడు. సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ.. కోటానే కావాలి అనేలా చేసుకున్నాడు. స్టార్ హీరోలకంటే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. మూడు షిప్ట్ లలో పనిచేశాడు.
All So Read: శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?
Kota Srinivasa rao
కోటాకు సినిమా ఇండస్ట్రీలో నిలబడటానికి సహాయం చేసిన సినిమా ఒకటి ఉంది. ఈసినిమాతో కోటా నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు కోటా శ్రీనివాస్ రావు. ఈసినిమాలో ఆయన నటన చూసి..చాలా మంది ఏంటి ఈ వ్యక్తి అని అనుకున్నారు. అవకాశాలు కూడా పెరిగిపోయాయి. ఈవిషయాన్ని ఓసందర్భంలో కోటా శ్రీనివాస్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నా కెరీర్‌కు కీలకమైన సినిమా ప్రతిఘటన అని చెప్పారు.
All So Read: ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
Kota Srinivasa Rao
ఇది నా కెరీర్‌ను నిలబెట్టిన సినిమా..? దేమాతరం సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే. పార్టీ అధ్యక్షుడుగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం. కాని నేను సోదరి సోదరిమణులారా అని చెప్పిన డైలాగ్ కు.. నేను వాడిన యాసకు కృష్ణ ఇంప్రెస్ అయ్యారు. ఇదేదో బాగుంది అని వెంటనే రచయితను నైట్ అంతా కూర్చోపెట్టి నాకోసం కొన్ని సీన్లు.. డైలాగ్స్ రాశారు.
All So Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్... హరి హర వీర మల్లు సాలిడ్ అప్ డేట్..?
దాదాపు ఎనిమిది తొమ్మిది సీన్లు నాకోసం రాశారు ఆయన. రాత్రంత కూర్చుకుని నాకోసం పనిచేశారు. ఇక షూటింగ్ పూర్తయ్యి.. ఈసినిమా రిలీజ్ అయ్యింది. ప్రతిఘటన నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. నాగురించి అందరికి తెలిసింది ఈ సినిమాతోనే. ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్ని అన్నారు కోటా శ్రీనివాసరావు.