కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేయడం మొదలు పెట్టారు.
అంతే కాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోటా, బాబుమోహన్ కాంబినేషన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ వన్, మాయలోడు, జంబలికిడిపంబ, సహా దాదాపు 60 సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది.
ఓనర్ పనివాడు,తండ్రీ కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు, ఇలా రకరాకల పాత్రలు వీరిద్దరు అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్, హీరోయిన్ తండ్రిగా కోట.. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్టపట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు.