దీనితో రవి.. అనీ మాస్టర్, హమీద, శ్వేతాలని ఎంచుకుంటాడు. అంటే వీరు రవితో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హులు. ఇంతలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తారు. ప్రియని శాశ్వతంగా కెప్టెన్సీ పొతే నుంచి ప్రారంభంలో తప్పించిన సంగతి తెలిసిందే. తిరిగి ఆమె కెప్టెన్సీ పోటీలోనిలిచే ఛాన్స్ బిగ్ బాస్ ఆమెకి ఇస్తారు. కాకపోతే రవి, అని మాస్టర్, శ్వేతా, హమీద లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. దీనితో హమీద..ప్రియా కోసం త్యాగం చేస్తుంది. అంతకు ముందు షణ్ముఖ్.. సీక్రెట్ గా కొంతమంది ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. హమీద మాత్రం కెప్టెన్ ఆ వద్దురా బాబు.. భరించలేం అని కామెంట్ చేస్తాడు. ఒక రకంగా ప్రియా కోసం హమీద బలైనట్లు అయింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్ చూస్తే కావాలనే ప్రియని హైలైట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలగక మానదు.