ప్రమోషన్ కోసం 10 కోట్లు, కొత్త హీరో సినిమాలో స్టార్ హీరోయిన్, ఏంటా సినిమా, ఎవరా హీరో ?

Published : Jul 22, 2025, 03:52 PM IST

అతనో కొత్త హీరో, ఫస్ట్ టైమ్ టాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. కానీ ఆ హీరోన జంటగా స్టార్ హీరోయిన్, భారీ బడ్జెట్ తో పాటు, ప్రమోషన్స్ కే 10 కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా సినిమా?

PREV
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే చాలా కష్టపడాలి... గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా సరే, ఆవగింజంతైనా అదృష్టం లేనిదే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు కాలేరు అని సీనియర్ దివంగత సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. హీరో అవ్వాలంటే బోల్డంత కష్టం, టాలెంట్ తో పాటు లక్కు కూడా కలిసి రావాలి. అయితే చాలామంది వారసత్వంగా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. చాలా ఈజీగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లు అవ్వాలని కోరుకుంటుంటారు. కాని వారసత్వంగా ఇండస్ట్రీలోకి రాగలరే కాని.. టాలెంట్ లేకపోతే మాత్రం ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేరు. అది చాలామంది విషయంలో నిజం అయ్యింది.

26

వారసులుగా వచ్చిన చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ వారసులుగా వచ్చినా కాని.. చాలా కష్టపడి, తమ టాలెంట్ చూపించి, ఎన్నోరిస్క్ లు చేసి మరీ.. అభిమానులను సంపాదించుకున్నారు. తండ్రులను మించిన తనయులు అనిపించుకున్నారు. వారికంటే సొంత గుర్తింపు కూడా సంపాదించారు. కొంతమంది నిర్మాతల కొడుకులు, డబ్బున్న వాళ్ళ తనయులు మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తారు. హీరోగా ఎంట్రీ వీళ్లకు ఈజీ అయినా తర్వాత నిలబడాలంటే ఎంత డబ్బున్నవాళ్ళైనా కష్టపడాల్సిందే, టాలెంట్ ఉండాల్సిందే.

36

అయితే తాజాగా ఓ హీరో కొత్తగా టాలీవుడ్ లోకి లాంచ్ అయ్యాడు. వచ్చీ రావడంతోనే కోట్లలో ఖర్చు పెడుతూ.. సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు కర్ణాటక మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి. జూనియర్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కిరీటి.. డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా గర్వం ప్రదర్శంచకుండా చాలా కూల్ గా, వినయంగా తన సినిమాను ప్రమోట్ చేసుకుని రిలీజ్ వరకూ వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈసినిమా ప్రమోషన్ కోసం మాత్రం కోట్లలో ఖర్చు చేశారు కిరీటి టీమ్.

46

కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ మూడేళ్ళ క్రితమే సినిమాని ప్రకటించారు. కాని రకరకాల కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఇన్నాల్టికి ఈసినిమా పట్టాలెక్కి, రిలీజ్ వరకూ వచ్చింది. కిరీటి హీరోగా శ్రీలీల హీరోయిన్ గా, జెనీలియా, రవిచంద్రన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జూనియర్ సినిమా జులై 18 న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఈ జూనియర్ సినిమాని కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ప్రమోట్ చేశారు. అన్ని థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ హడావిడి చేశారు.

56

పెద్ద పెద్ద స్టార్స్ ను ఈ సినిమా ఈవెంట్స్ కు వచ్చేలా ప్లాన్ చేశారు. తెలుగులో రాజమౌళిని సైతం ప్రమోషన్స్ కి రప్పించారు. కన్నడలో శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో ప్రమోషన్స్ చేయించారు. ఈ సినిమా కోసం ఓ పెద్ద సోషల్ మీడియా టీమ్ పనిచేసింది. సోషల్ మీడియాలో మీమ్ పేజీలు, ఎక్స్ హ్యాండిల్స్ లో సినిమా గురించి, కిరీటి గురించి బాగా ఎలివేషన్ ఇచ్చారు. అన్ని రకాలుగా జూనియర్ ప్రమోషన్ కు దాదాపు 10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.

66

అయితే హైదరాబాద్ లోని ఫేమస్ మాల్, థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ ని జూనియర్ ప్రమోషన్స్ తో నింపేశారు. ప్రసాద్ ఐమాక్స్ లో బయట గ్లాస్ ఎలివేషన్ నుంచి ప్రతి ఫ్లోర్ లో, ప్రతి డోర్ మీద, గోడలకు స్టిక్కర్స్, బ్యానర్స్ తో పాటు , జూనియర్ డిజిటల్ పోస్టర్స్ తో నింపేశారు. మొదటి సినిమాకే స్టార్ హీరో అవ్వలేరు కాబట్టి.. ఈసినిమాకు ఎన్ని ప్రమోషన్లు చేసినా.. మూవీ ఓ మోస్తరు సక్సెస్ సాధించిందని చెప్పాలి. మరి ముందు ముందు కిరీటి మరింత టాలెంట్ చూపించి, కష్టపడి ఆడియన్స్ ను మెప్పిస్తాడా అనేది. చూడాలి. కిరీటి సినిమా సెలక్షన్స్, నటన ఎలా ఉంటుంది, ఏంటీ అనేదాన్ని ప్రకారం మూవీ కెరీర్ ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories