హరిహర వీరమల్లు రిలీజ్
రిలీజ్ కు రెడీగా ఉంది హరిహర వీరమల్లు’ సినిమా. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీమ్ ప్రమోషన్స్ ను జోరుగా కొనసాగిస్తుండగా.. రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేవారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. ఇక తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.
దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, 17వ శతాబ్దం నాటి మొఘల్, కుతుబ్ షాహీ పరిపాలన నేపథ్యంగా సాగనుంది. పవన్ ఈ సినిమాలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈమూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు.