82 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేది లేదంటున్న బిగ్ బి
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో, ఎనిమిది పదుల వయస్సులో కూడా తగ్గేదే లే అంటున్నాడు. సినిమాలు, రియాల్టీ షోలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. పనిలోనే తనకు సంతోషం ఉంది అంటున్నారు అమితాబ్. అంతే కాదు సినిమా చేసినా.. ఏదైనా షోను హోస్ట్ చేసినా సరే కోట్లలో రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తున్నాడు.
సాధారణంగా ఈ ఏజ్ లో హ్యాపీగా రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. కాని అమితాబ్ మాత్రం తను చేయగలిగినంత వరకూ నటిస్తూనే ఉంటానని అంటున్నారు. ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా బిజీ అయ్యారు బిగ్ బి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు.