`కింగ్‌డమ్` మూవీ కంటెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఏదో ఉండబోతుందనే విషయాన్ని చాటి చెబుతుంది. విడుదలైన ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ పాత్రలోని షేడ్స్ మతిపోగొడుతుంది.
ఆయన రెండు మూడు గెటప్స్ లో కనిపించారు. ఒక పోలీస్‌గా, ఒక స్పైగా, గ్యాంగ్‌కి నాయకుడిగా కనిపిస్తున్నారు. అదే సమయంలో ఓ రాజ్యానికి ఎంపరర్‌గానూ కనిపిస్తారని తెలుస్తోంది.
మరోవైపు సత్యదేవ్, విజయ్ అన్నాతమ్ముళ్లుగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య బాండింగ్ బలంగా ఉంటుందని, అదే సమయంలో ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మారతారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇవన్నీ సినిమాపై హైప్‌ని పెంచుతున్నాయి.