`బిగ్‌ బాస్‌ తెలుగు 9` లోకి క్రేజీ సింగర్‌.. లేటెస్ట్ కంటెస్టెంట్ల లిస్ట్.. వాళ్లకి అగ్నిపరీక్షే

Published : Jul 29, 2025, 07:45 PM IST

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` కంటెస్టెంట్లకి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. సింగర్‌ విభాగం నుంచి క్రేజీ కంటెస్టెంట్‌ హౌజ్‌లోకి రాబోతున్నారట. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 లో అగ్నిపరీక్ష

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` రోజు రోజుకి ఆసక్తిని రేకెత్తిస్తుంది. షో ప్రారంభానికి ఇంకా నెలకుపైగానే ఉంది. కానీ బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ట్విస్ట్ లతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. 

ఈ సారి కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆగస్ట్ రెండో వారంలో ఫైనల్‌ ఎంపిక జరుగుతుందని, అగ్నిపరీక్ష పేరుతో ఈ ఫిల్టర్‌ కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది.

DID YOU KNOW ?
అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ట్ ఫైనల్‌
బిగ్‌ బాస్ తెలుగు 9కి సంబంధించి అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య కంచర్ల కంటెస్టెంట్‌గా కన్ఫమ్‌ అయ్యిందట.
25
`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లో కామన్‌ మ్యాన్‌కి పెద్ద పీఠ

సుమారు 14 మందికి ఈ అగ్నిపరీక్షలో పాల్గొనబోతున్నారని సమాచారం. అయితే ఈ సారి కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఎక్కువ మందిని తీసుకోబోతున్నారట. 

సుమారు ఐదుగురుని కంటెస్టెంట్లుగా  ఎంపిక చేసే ఆలోచనలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. అందుకే వీరి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

35
కాంట్రవర్షియల్‌ కంటెస్టెంట్లకి ప్రయారిటీ

మరోవైపు సెలబ్రిటీల కంటెస్టెంట్లకి సంబంధించి ఈ సారి నోటెడ్‌ ఆర్టిస్ట్ లను దించుతున్నారు. ముఖ్యంగా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన వారిని తీసుకుంటున్నారట.

 ఇదిలా ఉంటే సింగర్‌ విభాగంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ సింగర్‌ కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. సింగర్‌ శ్రీతేజని ఓకే చేసినట్టు టాక్‌.

45
బిగ్‌ బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్‌గా శ్రీతేజ

సింగర్‌ శ్రీతేజ గాయకుడిగా చాలా పాపులర్‌. అనేక సినిమాల్లో మంచి రొమాంటిక్‌ మెలోడీ సాంగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. తెలుగు సినిమా సింగర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

 ఆర్కేస్టాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తెలుగు సినిమా సింగర్స్ లో ప్రముఖంగా రాణిస్తున్నారు. ఆయన ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోలోకి రాబోతున్నట్టు సమాచారం. 

సింగింగ్‌ విభాగం నుంచి ఇటీవల ప్రతి సీజన్‌కి ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఈ సారి శ్రీతేజని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావల్సి ఉంది.

55
బిగ్‌ బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్ల లిస్ట్

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన లేటెస్ట్ కంటెస్టెంట్ల లిస్ట్ తెలుస్తోంది. ఇందులో అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల, కల్పిక గణేష్‌, దీపికా, దేబ్‌జానీ, కావ్య శ్రీ, ఇమ్మాన్యుయెల్‌, తేజస్విని, శివ, సాయి కిరణ్‌, ఏక్‌నాథ్‌, నవ్య సామి,

 జానులిరి, సాయి కిరణ్‌, దర్శకుడు పరమేశ్వర్‌, నాగ దుర్గా, సుమంత్‌ అశ్విన్‌, జ్యోతిరాయ్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంత మంది ఫైనల్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories