
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీ విజయవంతంగా రన్ అవుతుంది. 17వ శతాబ్దంలోని మొఘల్ పాలన నేపథ్యంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆగడాలను ప్రధానంగా చేసుకుని కొహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాని రూపొందించారు.
నిజానికి ఈ మూవీని స్టార్ చేసింది దర్శకుడు క్రిష్. ఆయనే కొంత పార్ట్ షూటింగ్ చేశారు. కానీ ఆయన మధ్యలోనే తప్పుకున్నారు. సినిమా షూటింగ్ డిలే కావడంతోపాటు కొంత క్రియేటివ్ డిఫరెంట్స్ కారణంగానూ ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమా ఆగిపోయిందనుకునే సమయంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు.
షూటింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. సినిమా డిలే కావడం వల్ల బజ్ తగ్గింది. కానీ చివర్లో పవన్ కళ్యాణ్ తన భుజాలపై వేసుకున్నారు. గట్టిగా ప్రమోషన్ చేశారు.
దీంతో దెబ్బకి మూవీ రేంజ్ మారిపోయింది. అది ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా `హరి హర వీరమల్లు` నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి పారితోషికాల డిటెయిల్స్ బయటకు వచ్చాయి. మెయిన్‌గా ఆర్టిస్ట్ ల పారితోషికాలు ఎంతనేది చూస్తే, కాస్టింగ్ కి తక్కువ పారితోషికాలే ఇచ్చినట్టు తెలుస్తోంది.
సాధారణంగా పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించి హీరోలకే భారీగా రెమ్యూనరేషన్ ఉంటుంది. ఒక్కో హీరో వంద కోట్లకుపైగా తీసుకుంటారు.
కానీ ఇందులో పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా తీసుకున్నారట. `బ్రో` సినిమాకి పవన్ యాభై కోట్లు తీసుకున్నట్టు సమాచారం.
కానీ `హరి హర వీరమల్లు` మూవీకి కేవలం రూ.20కోట్లు మాత్రమే కోట్ చేశారట. అయితే అందులో ఆయనకు ఎనిమిది కోట్ల వరకు అడ్వాన్స్ గా ఇచ్చారట. అది కూడా నిర్మాతకు రిటర్న్ చేసినట్టు సమాచారం.
ఈ లెక్కన ఈ మూవీకి పవన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇటీవల ప్రెస్ మీట్‌లో పవన్ మాట్లాడుతూ, సినిమా హిట్ అయితేనే పారితోషికం అని అన్నారు.
ఆయన మాటలను బట్టి చూస్తే, ఈ సినిమాకి పవన్ ఫ్రీగానే పనిచేశారని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడు రిజల్ట్ ని, కలెక్షన్లని చూస్తుంటే పవన్ కి పారితోషికం దక్కుతుందా అనేది డౌటే.
పవన్ కళ్యాణ్‌ని పక్కన పెడితే ఇందులో బాలీవుడ్ నటుడు `బాబీ` డియోల్ కీలక పాత్ర పోషించారు. ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఆయన ఈ సినిమా కోసం మూడు కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.
మరోవైపు హీరోయిన్‌గా చేసిన నిధి అగర్వాల్‌కి రెండున్నర కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు టాక్. మిగిలిన ఆర్టిస్ట్ లు సునీల్, రఘుబాబు, నాజర్, కబీర్ సింగ్, సచిన్ ఖేడ్కర్ వంటి వారు కాల్షీట్లని బట్టి లక్షల్లో, వేలల్లో అందుకున్నారు.
ఈ లెక్కన పారితోషికాల పరంగా సినిమాకి పెద్దగా బడ్జెట్ ఏం కాలేదు. కానీ ప్రొడక్షన్ పరంగానే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని, ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ.200కోట్లు అయి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా వంద కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం.