
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్డమ్` మూవీ రెండు రోజుల క్రితమే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. పాజిటివ్ టాక్‌తో సినిమా రన్ అవుతుంది. (`కింగ్డమ్ రివ్యూ) ఆడియెన్స్ ని బాగా అలరిస్తోంది. దీంతో మొదటి రోజు ఈ మూవీ మంచి కలెక్షన్లని రాబట్టింది. ఫస్ట్ డే ఏకంగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని వసూలు చేసింది. సుమారు. రూ.39కోట్ల గ్రాస్ రాబట్టినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
చాలా ఏరియాలో ఈ మూవీ నలభై నుంచి యాభై శాతం వరకు వసూలు చేసే అవకాశం ఉందని నిర్మాత నాగవంశీ విడుదల రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే రూ.35-40కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కలెక్షన్లని రాబట్టడం విశేషం. బేసిక్‌గా రెండో రోజు బాగా కలెక్షన్లు పడిపోతుంటాయి. మొదటి రోజు ఉన్నంతగా ఉండవు. ఈ మూవీ విషయంలోనూ అదే జరిగింది. కానీ రెండో రోజు ఎక్కువగా డ్రాప్ లేదు. చాలా స్టడీగా వసూళ్లు ఉండటం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు దాదాపు రూ.10కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ 20కోట్లకుపైగానే ఉంటుంది. ఇతర స్టేట్స్ లోనూ బాగానే ఉంది. ఓవర్సీస్‌లోనూ ఒక మిలియన్ డాలర్లు దాటి రాబట్టింది. ఇలా మొదటి రోజు రూ.39కోట్ల(గ్రాస్) రాబట్టడం విశేషం. ఇక రెండో రోజు ఈ మూవీ రూ. 14కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా రెండో రోజుల్లో `కింగ్డమ్` మూవీ రూ.53కోట్లు రావడం విశేషం. ఇక రెండో రోజు నైజాంలో 1.85 కోట్లు, సీడెడ్ రూ.79లక్షలు, ఉత్తరాంధ్ర రూ.48 లక్షలు, గుంటూరు రూ.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.26 లక్షలు, వెస్ట్ గోదావరి రూ.18 లక్షలు, నెల్లూర్ రూ.13 లక్షలు, కృష్ణ రూ.21లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా రెండో రోజు రూ.4.11 కోట్ల షేర్ వచ్చింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.14కోట్ల షేర్ రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.27కోట్ల షేర్ సాధించిందని అంచనా.
`కింగ్డమ్` మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.36కోట్ల బిజినెస్ అయ్యింది. ఇతర స్టేట్స్, ఓవర్సీస్ కలుపుకుని రూ.52కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. సినిమా హిట్ కావాలంటే సుమారు వంద కోట్ల(గ్రాస్) కలెక్షన్లు వసూలు చేయాలి. ఇప్పటికే యాభై దాటిన నేపథ్యంలో ఇంకా యాభై కోట్ల గ్రాస్ రాబడితే బయ్యర్లు, నిర్మాత సేఫ్‌లో ఉంటారని చెప్పొచ్చు. అయితే శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తోంది. కాబట్టి మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్లబోతుందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన `కింగ్డమ్` మూవీ ఈ గురువారం(జులై 31)న విడుదల అయ్యింది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, మలయాళ నటుడు వెంకటేష్ వైపీ ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అన్నదమ్ముల మధ్య బాండింగ్, వారి మధ్య ఎమోషన్స్ ని ప్రధానంగా చేసుకుని యాక్షన్ ని హైలైట్‌గా చూపిస్తూ శ్రీలంక బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడిగా, సత్యదేవ్ అన్నగా నటించారు. వెంకటేష్ వైపీ నెగటివ్ రోల్ చేశారు.