శోభన్ బాబు, చిరంజీవితో నటించిన హీరోయిన్.. రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె జీవితం ఏమైందో తెలుసా ?
రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. అవకాశాలు రాకపోవడం, వచ్చిన సరైన సక్సెస్ లేకపోవడం లాంటి కారణాలు ఉంటాయి. అయితే బద్ధకం వల్ల చిత్ర పరిశ్రమలో ఒక సీనియర్ నటి చాలా అవకాశాలు కోల్పోయింది. ఆమె పేరు నళిని. తెలుగులో నళిని ఇంటిగుట్టు, సంఘర్షణ లాంటి చిత్రాల్లో నటించింది.
చాలా చిన్న వయసులో నళినికి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ ఏజ్ లో మెచ్యూరిటీ లేకపోవడం, అవుట్ డోర్ షూటింగ్స్ అంటే భయం ఉండడం వల్ల చాలా చిత్రాలు రిజెక్ట్ చేసినట్లు నళిని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నళిని తెలుగులో శోభన్ బాబు, చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో నటించింది. చిరంజీవితో కలసి ఇంటిగుట్టు, సంఘర్షణ చిత్రాల్లో ఆమె నటించారు. ఇక శోభన్ బాబుతో తోడు నీడ, మానవుడు దానవుడు లాంటి చిత్రాల్లో నటించింది.
నళిని తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 1987లో నళిని తమిళ నటుడు రామరాజన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అమ్మాయి, అబ్బాయి ట్విన్స్ గా జన్మించారు. తన పెళ్లి గురించి నళిని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2000 సంవత్సరంలో నళిని, రామరాజన్ విడాకులు తీసుకుని విడిపోయారు.
తామిద్దరం విడిపోతామని ముందే తనకి తెలుసు అని నళిని తెలిపారు. ఎందుకంటే మా పెళ్లి రాహుకాలంలో జరిగింది. దీనితో జ్యోతిష్యుడు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. మీ మధ్య సమస్యలు వస్తాయి అని చెబుతూ ఉండేవారు. ఎలా రాసిపెట్టు ఉంటే ఆలా అవుతుంది అని అనుకునేదాన్ని. ఆ తర్వాత మా మధ్య నిజంగానే విభేదాలు వచ్చి విడిపోయాం. అయితే మేము ఎక్కువగా గొడవ పడి విడిపోలేదు. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి అని నళిని అన్నారు.
తమ పిల్లల వల్ల తన భర్త కెరీర్ దిగజారుతుంది అని కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పారట. అందుకే పిల్లలని చదివించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. మా విడాకుల తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు అని నళిని పేర్కొంది. నళిని తన సెకండ్ ఇన్నింగ్స్ లో టివి సీరియల్స్ లో నటిస్తున్నారు. అదే విధంగా రవితేజ కిక్ చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు.