మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోని తట్టిల్ ని గత ఏడాది పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ళ పాటు వీరిద్దరి లవ్ స్టోరీ సాగింది. తల్లిదండ్రులంటే ముందుగా కీర్తి సురేష్ తన ప్రియుడి గురించి ఓ తెలుగు హీరోకి చెప్పిందట. అతడెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఆంటోని తట్టిల్ ని ఆమె పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ళు సుదీర్ఘమైన రిలేషన్ వీరిద్దరిదీ. 15 ఏళ్ళు ప్రేమించుకున్నప్పటికీ కీర్తి సురేష్ తన లవ్ స్టోరీ బయటపడకుండా జాగ్రత్త పడింది. కీర్తి సురేష్ ఇటీవల జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి అతిథిగా హాజరైంది. ఈ షోలో కీర్తి సురేష్ తన లవ్ స్టోరీ విశేషాలు పంచుకుంది.
25
జగపతి బాబు సెటైర్లు
కీర్తి సురేష్ తల్లిదండ్రులు మేనకా సురేష్, సురేష్ కుమార్ ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. వీరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ ఇంట్లో అందరూ ఏళ్ల తరబడి ప్రేమించుకుంటూనే ఉంటారా అంటూ సెటైర్లు వేశారు. చదువు మానేయాలనే ఉద్దేశంతో కావాలనే ఫెయిల్ అయ్యావు కదా అని జగపతి బాబు ప్రశ్నించారు. కీర్తి సురేష్ సమాధానం ఇస్తూ.. 12th తర్వాత యుఎస్ వెళ్ళమని ఇంట్లోవాళ్ళు చెప్పారు. నాకు యుఎస్ వెళ్లడం ఇష్టంలేదు. సినిమాల్లోకి వెళ్లాలని కోరిక ఉండేది. యుఎస్ కి వెళ్ళడానికి అవసరమైన టోఫెల్ శాట్ పరీక్షలో కావాలనే ఫెయిల్ అయినట్లు కీర్తి సురేష్ తెలిపింది.
35
అందుకే పెళ్లి ఆలస్యంగా..
ఈ రోజుల్లో ఏళ్ల తరబడి ప్రేమించుకోవడం, ఎదురుచూడడం అనేది చాలా అరుదు. నీ లవ్ స్టోరీ ఈ జనరేషన్ కి ఆదర్శంగా నిలుస్తుంది అని జగపతి బాబు అన్నారు. స్కూల్ లో ఉన్నప్పటి నుంచే కీర్తి సురేష్, ఆంటోని తట్టిల్ మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి కోసం ఎందుకు అన్నేళ్లు ఎదురుచూశారు అని జగపతి బాబు ప్రశ్నించారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ..' మేము ప్రేమించుకునే సమయానికి కాలేజ్ కూడా పూర్తి చేయలేదు. కెరీర్ గురించి క్లారిటీ లేదు. మా 15 ఏళ్ళ రిలేషన్ లో 5 ఏళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఆంటోనీ కెరీర్ కోసం ఖతార్ కి వెళ్లారు. నేను చెన్నైలో ఉన్నాను.
తిరిగి వచ్చే సమయానికి నేను సినిమాల్లో నటించడం ప్రారంభించాను. తను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. మా ఇద్దరి రిలీజియన్స్ వేర్వేరు. దానివల్ల కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో అనే టెన్షన్ ఉండేది. అందుకే ఇంట్లో చెప్పడానికి సమయం తీసుకున్నాం. ఇంట్లో చెప్పలేదు కానీ ముందుగా మీకే చెప్పాను అని కీర్తి సురేష్ జగపతి బాబుని ఉద్దేశించి తెలిపింది.
55
నాన్న ఓకె చెప్పారు
నాలుగేళ్ళ ముందు నాన్నకి ఈ విషయం చెప్పాను. వెంటనే ఒకే చెబుతారా ? వద్దు అంటారా ? తిడతారా ? ఇలా నాలో చాలా ప్రశ్నలు ఉండేవి. కానీ నాన్న చాలా స్మూత్ డెసిషన్ తీసుకున్నారు. మా పెళ్ళికి అంగీకారం తెలిపారు అని కీర్తి సురేష్ పేర్కొంది. మొత్తంగా కీర్తి సురేష్ తన లవ్ స్టోరీని కుటుంబ సభ్యులకంటే ముందుగానే జగపతి బాబుకి తెలిపింది. జగపతి బాబు, కీర్తి సురేష్ అన్నాత్తే, మిస్ ఇండియా లాంటి చిత్రాల్లో నటించారు.