సినిమా విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ బావుంటుంది. నాగార్జున కొడుకు అఖిల్ నటించిన ఓ మూవీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమకి అద్భుతమైన మాస్ చిత్రాలు అందించిన దర్శకులలో వివి వినాయక్ ఒకరు. వివి వినాయక్ చిత్రాలు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటాయి. హీరోల ఎనర్జీని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఆయన. ఆది, ఠాగూర్, బన్నీ, కృష్ణ, నాయక్, దిల్, అదుర్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వినాయక్ దర్శకత్వంలో వచ్చాయి. వినాయక్ కెరీర్ లో భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు కూడా ఉన్నాయి.
25
వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అఖిల్
వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిస్సప్పాయింట్మెంట్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ' అఖిల్' చిత్రం గురించే. ఈ మూవీని హీరో నితిన్ భారీ బడ్జెట్ లో నిర్మించారు. నితిన్ ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఖాయం అని అనుకున్నారు.
35
చిరంజీవి ఇచ్చే సలహాలు బాగుంటాయి
కానీ అఖిల్ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఫైట్స్, డ్యాన్సులతో అఖిల్ అదరగొట్టాడు. కానీ ఈ చిత్ర కథ ఎవరికీ కనెక్ట్ కాలేదు. ఈ మూవీ ఫెయిల్యూర్ గురించి వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీ తప్పులని ఎవరైనా చెబితే సరిచేసుకుంటారా అని యాంకర్ ప్రశ్నించగా వినాయక్ ఇలా సమాధానం ఇచ్చారు. 'పాజిటివ్ గా చెబితే తప్పకుండా తీసుకుంటాను. అలా నాకు పాజిటివ్ వేలో చిరంజీవి గారు సలహాలు ఇస్తుంటారు. ఆయన చెప్పే విధానం చాలా బావుంటుంది. అఖిల్ మూవీ రిలీజైన నెల రోజుల తర్వాత ఒకసారి చిరంజీవి గారిని కలిశాను.
అఖిల్ మూవీ చూశానని చిరంజీవి గారు అన్నారు. మూవీ అంతా బావుంది వినాయక్. పాటలు, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ బావున్నాయి. సినిమా క్వాలిటీ చాలా బావుంది. కానీ కథ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అల్లిక లేదు. స్క్రీన్ ప్లే వల్ల కథతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అదొక్కటే లోపం. నెక్స్ట్ టైం నుంచి అది జాగ్రత్తగా చూసుకో' అని చిరంజీవి చెప్పినట్లు వినాయక్ తెలిపారు.
55
అది వర్కౌట్ కాదని ముందే చెప్పేసిన చిరంజీవి
చిరంజీవి గారు చెప్పిన విధానం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన ఇచ్చిన సలహాతో కాంప్లికేటెడ్ కథలని పక్కన పెట్టేయాలి అనే లెసన్ నేర్చుకున్నట్లు వినాయక్ తెలిపారు. అఖిల్ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారు లోపాలు చెప్పారు. కానీ నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ మూవీకి చిరంజీవి ముందే జోస్యం చెప్పేశారు. కనీసం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే జోష్ మూవీ వర్కౌట్ కాదు అని చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయాన్ని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాస్తవానికి జోష్ కథ అనుకున్నది రాంచరణ్ కోసం. దీనితో కథని చిరంజీవికి వినిపించారు. ఇది వర్కౌట్ అయ్యే కథ కాదు అని దిల్ రాజుకి చిరంజీవి చెప్పేశారు. ఎలాగైనా ఈ చిత్రాన్ని హిట్ చేయాలి అనే కసితో దిల్ రాజు.. నాగ చైతన్యతో మూవీ చేశారు. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.