దాదాపు 40 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు చిరంజీవి. సాధారణ నటుడిగా స్టార్ట్ అయ్యి.. సుప్రీం హీరోగా.. ఆతరువాత మెగాస్టార్ గా చిరంజీవి ప్రస్థానం అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సీనీ పరిశ్రమకు పెద్దదిక్కుగా పెద్దన్నగా మారాడు చిరంజీవి. తెలుగు సినిమాకు ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అంటూ ముందుంటారు చిరంజీవి.
ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇండస్ట్రీ బాగోగులు చూసుకుంటున్నారు. ఇక మెగా వారుడిగా రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి ఇమేజ్ టాలీవుడ్ వరకే పరిమితం అయ్యింది.
కాని రామ్ చరణ్ ఇమేజ్ పాన్ ఇండియాను దాటి ప్రపంచ వ్యాప్తం అయ్యింది. ఆస్కార్ రేంజ్ కు వెళ్ళింది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆతరువాత టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.