‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ గా వరుణ్ తేజ్, డిటేల్స్

First Published | Oct 5, 2024, 9:38 AM IST

‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలు వరుసగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారడంతో, ఈ సారి సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

Varun Tej, Kanaka Raju, Merlapaka Gandhi


టైటిల్ గమ్మత్తుగా పెడితే ప్రేక్షకులు ఆసక్తిగా ఏంటి సినిమా , ఎవరు చేస్తున్నారు వంటి విషయాలతో బజ్ క్రియేట్ అవుతుంది. ఆ విషయం గమనించిన దర్శకులు వెరైటీ టైటిల్స్ అన్వేషిస్తూంటారు. ఆ టైటిల్స్ మొదట చిత్రంగా అనిపించినా తర్వాత భలే ఉందే అనిపిస్తుంది. అలా ఇప్పుడు వరుణ్ తేజ కొత్త చిత్రానికి  ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఏ దర్శకుడుతో చేస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. నిర్మాతలు ఎవరు వంటి విషయాలు చూద్దాం. 


వరుణ్ తేజ్ కెరీర్ లో పెద్దగా చెప్పుకోవటానికి హిట్స్ లేనప్పటికీ విభిన్నమైన కథలు ఎంచుకోవటంలో ముందుంటున్నారు.  వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలు వరుసగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారడంతో, ఈ సారి సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు.ఆ క్రమంలో ఇప్పుడు మట్కా చిత్రం చేస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’.
 



 కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీని నవంబరు 14న విడుదల చేయనున్నారు.  ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మట్కా’ రూపొందుతోంది.

కరుణ కుమార్‌ పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను తయారు చేశారని తెలుస్తోంది. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారాయన. వరుణ్‌ తేజ్‌ని నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.  మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్తీక ΄పౌర్ణమికి ముందుగా నవంబర్‌ 14న విడుదల కానున్న మా సినిమాకి లాంగ్‌ వీకెండ్‌ కలిసొస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 
 


ఇదిలా ఉంటే వ‌రుణ్ చేయ‌బోయే నెక్ట్స్ సినిమా కూడా దాదాపుగా ఫిక్స‌య్యింది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వ‌రుణ్‌. వరుణ్ తేజ్  ఈ సినిమాతో క్రైమ్ కామెడీ జోనర్‌లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి  ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌత్ కొరియాలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.


నవంబర్‌లో షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’లో కొంత భాగం కొరియాలోనూ, మ‌రికొంత భాగం రాయ‌ల‌సీమ‌లోనూ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. యాక్ష‌న్‌కి పెద్ద పీట వేసే ఈ క‌థ ఓ వెరైటీ కాన్సెప్ట్ చుట్టూ తిర‌గ‌బోతోంద‌  వార్తలు వస్తున్నాయి.  ఇదే కాకుండా, ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో కూడా వరుణ్ మరో చిత్రం చేయనున్నాడు.

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Latest Videos

click me!