
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. ఇప్పటికే సనాతన ధర్మంపై ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటలయుద్ధం మొదలైంది. సనాతన ధర్మం చాలా ప్రమాదమని, దీనిని సమూలంగా నిర్మూలిస్తామని ఉదయనిధిస్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు..
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసేందుకు వెనకాడమని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధిపై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు.
కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు అని అన్నారు.
తిరుపతి లడ్డూ వివాదంలో ఉదయనిధికి ఏ మాత్రం సంబంధం లేదని, అయినా పవన్ కల్యాణ్ విమర్శలు చేశారంటూ మంజినాథన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్.
పవన్ టార్గెట్ గా పాత విడియోలను, ట్రోల్స్ చేస్తోంది డిఎంకే సోషియల్ మిడియా వింగ్. పవన్ కు సపోర్ట్ గా డిఎంకే సోషియల్ మిడియా వింగ్ కౌంటర్ ఇస్తోంది బిజెపి వింగ్. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్ పై మదురై పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వాంజినాధన్ ఫిర్యాదు చేశారు.
తమిళనాడుకు చెందిన ఓ పాపులర్ టీవీ చానల్ పవన్ ను దాదాపుగా గంటన్నర పాటు ఇంటర్యూ చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ ప్రధానంగా తమిళ అంశాలు, హిందూత్వంపైనే మాట్లాడారు. తడబడకుండా తమిళ సంస్కృతిపై ఆయన చెప్పిన మాటలు.. అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులోనూ ఆయన ఇప్పుుడు ఈ విషయమై వైరల్ గా మారారు. వచ్చే కొద్ది రోజుల్లో ఆయన కర్ణాటక,కేరళల్లోనూ పర్యటించినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.