కీర్తి సురేష్ టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే, ఆ హీరోయిన్ రాంగ్ డెసిషన్ ఎలా వరంగా మారిందో తెలుసా ?

Published : Oct 17, 2025, 12:25 PM IST

కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తెలుగులో నటించిన టాప్ 5 బెస్ట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఓ హీరోయిన్ తీసుకున్న రాంగ్ డిసిషన్ కీర్తి సురేష్ కి ఏకంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. 

PREV
16
కీర్తి సురేష్ టాప్ 5 బెస్ట్ మూవీస్

హీరోయిన్ కీర్తి సురేష్ నేడు శుక్రవారం అక్టోబర్ 17న తన 33వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో అభిమానులు కీర్తి సురేష్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ చిత్రంతో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఆమె టాలీవుడ్ లో 11 చిత్రాల్లో నటించారు. వాటిలో హిట్టైన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 

26
నేను శైలజ 

టాలీవుడ్ కి కీర్తి సురేష్ కి డెబ్యూ చిత్రం ఇదే. రామ్ పోతినేని సరసన నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తొలి చిత్రంతోనే కీర్తి సురేష్ తన క్యూట్ లుక్స్, నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది. 

36
నేను లోకల్ 

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో నానితో కీర్తి సురేష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 

46
మహానటి 

కీర్తి సురేష్ ఎన్ని సినిమాల్లో నటించినా.. మహానటి చిత్రానికి మరేవీ సాటిరావు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించింది. అయితే ఈ చిత్రంలో అవకాశం కీర్తి సురేష్ కి అదృష్టం కొద్దీ దక్కింది. ముందుగా సావిత్రి బయోపిక్ కోసం నాగ్ అశ్విన్ నిత్యా మీనన్ ని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నిత్యామీనన్ అలా మొదలైంది చిత్రంలో నటించినప్పటి నుంచి ఆమెని సావిత్రితో పోల్చుతూ ప్రశంసించేవారట. కానీ సావిత్రి బయోపిక్ విషయంలో ఆమె తీసుకున్న రాంగ్ డెసిషన్ కీర్తి సురేష్ కి వరంలా మారింది. ఈ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 

56
రంగ్ దే 

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే చిత్రం. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ మూవీలో కీర్తి సురేష్, నితిన్ పోటాపోటీగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదనిపించింది. 

66
దసరా 

హీరో నానితో పాటు కీర్తి సురేష్ కి కూడా ఇది ఛాలెంజింగ్ చిత్రమే. అయినప్పటికీ తన పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories