`తెలుసు కదా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సిద్ధు జొన్నలగడ్డ రచ్చ ఎలా ఉందంటే?

Published : Oct 17, 2025, 12:19 PM IST

`టిల్లు` చిత్రాలతో ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు `తెలుసు కదా` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`తెలుసు కదా` మూవీ రివ్యూ

సిద్ధు జొన్నలగడ్డని చూడగానే ఆడియెన్స్ కి గుర్తొచ్చే పేరు `టిల్లు`  అని చెప్పొచ్చు. అంతగా ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. `టిల్లు` చిత్రాల తర్వాత `జాక్` అంటూ మరో మూవీ చేశాడు. కానీ ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో తాను కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు, మరో హిట్‌ కొట్టేందుకు ఇప్పుడు `తెలుసు కదా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి లేడీ డైరెక్టర్‌ నీరజ కోన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌, ఆమె కూతురు కలిసి నిర్మించారు. దీపావళి పండగ సీజన్‌ని పురస్కరించుకుని శుక్రవారం(అక్టోబర్‌ 17)న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రసాద్‌ ఐమాక్స్ లో జర్నలిస్ట్ లతో కలిసి తిలకించాను. థియేటర్ వద్ద మంచి కోలాహలం కనిపించింది. మరి సినిమా అలరించిందా? సిద్ధుకి మరో హిట్‌ పడిందా అనేది రివ్యూలో చూద్దాం.

26
`తెలుసు కదా` మూవీ కథ ఏంటంటే?

వరుణ్‌(సిద్దు జొన్నలగడ్డ) తన గర్ల్ ఫ్రెండ్‌ హ్యాండివ్వడంతో బాధపడుతుంటారు. ఆమె గుర్తులన్నీ చెరిపేస్తుంటాడు. అదే సమయంలో ఇంకెప్పుడు మరో అమ్మాయితో ఇలాంటి మోసానికి గురి కావద్దు, ఎవరిని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాలని నిర్ణయించుకుంటాడు. కట్‌ చేస్తే కొన్ని రోజుల్లోనే ఓ పెద్ద రెస్టారెంట్‌ కి ఓనర్ అవుతాడు. తన ఫ్రస్టేషన్‌ అంతా ఎంప్లాయిస్‌ మీద చూపిస్తుంటాడు. ఇలా ఉంటే బాగాలేదని పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు ఫ్రెండ్‌ అభి(వైవా హర్ష). కొంత మంది అమ్మాయిలను చూడగా, వింతగా ఫీలవుతాడు వరుణ్‌. పెళ్లి అనేది నేచురల్‌గా జరగాలని, అమ్మాయి తన లైఫ్‌లోకి నేచురల్‌గా రావాలని కోరుకుంటాడు. ఇంతలో మరో సంబంధం వస్తుంది. ఆమెనే అంజలి(రాశీఖన్నా). మొదటి మీట్‌లోనే ఆమెతో ఏదో కనెక్షన్‌ ఫీల్‌ అవుతాడు వరుణ్‌. ఇద్దరు క్లోజ్‌ అవుతారు. పెళ్లి చేసుకుంటారు. వరుణ్‌ బేసిక్‌గా అనాథ. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడంతో భవిష్యత్‌లో తనకు మంచి ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటాడు. పిల్లల కోసం బాగా తపిస్తుంటాడు. కానీ అంజలికి పిల్లలు కారని డాక్టర్‌ చెప్పడంతో షాక్‌ అవుతాడు. అయితే సరోగసి అనేది ప్రత్యమ్నాయ మార్గం ఉందని డాక్టర్‌ రాగా కుమార్‌(శ్రీనిధి శెట్టి) ద్వారా తెలుసుకున్న అంజలి, సరోగసికి సిద్ధమవుతుంది. దానికి వరుణ్‌ కూడా ఓకే చెబుతాడు. సరోగసికి రాగా కుమారే రెడీ అవుతుంది. ఆమె ఎవరో కాదు వరుణ్‌ ఫస్ట్ లవర్‌. ఈ విషయం తెలిశాక వరుణ్‌ రియాక్షన్‌ ఏంటి? రాగా కుమార్‌ ఎందుకు సరోగసికి రెడీ అయ్యింది? ఈ విషయం తన భార్య అంజలికి తెలిసిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.

36
`తెలుసు కదా` మూవీ విశ్లేషణ

హీరో యంగ్‌ ఏజ్‌లో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆమె బ్రేకప్‌ చెప్పడంతో కుంగిపోవడం, ఆ తర్వాత దాన్నుంచి మూవ్‌ అయి పెళ్లి చేసుకొని లైఫ్‌లో ఫ్యామిలీతో సెట్‌ అవ్వాలనుకోవడం, కానీ భార్యకి పిల్లలు కారని తెలియడం, పిల్లలు కనేందుకు తన మొదటి గర్ల్ ఫ్రెండే రెడీ అవ్వడం ఆ తర్వాత చోటు చేసుకున్న డ్రామానే సింపుల్‌గా ఈ మూవీ కథ. ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. కథగా చూసినప్పుడు చాలా కొత్తగా ఉంది. క్రేజీగా ఉంది. ఈ సినిమాని లేడీ డైరెక్టర్‌ నీరజ కోన రూపొందించడం ఇందులో హైలైట్‌. కథకి తగ్గట్టుగానే క్రేజీ హీరో సిద్ధుని ఎంపిక చేసుకోవడం ఇందులో మరో క్రేజీ ఎలిమెంట్‌గా చెప్పొచ్చు. సినిమా సిద్ధు లవ్‌ బ్రేకప్‌ సీన్‌తో స్టార్ట్ అవుతుంది. తను బాధపడటం, ఆయన మార్క్ ఆవేదన వ్యక్తం చేయడం, కొటేషన్స్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత కట్‌ చేస్తే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వింతైన అమ్మాయిలు కలవడం అతనికి క్రేజీగా ఉంటుంది. చూసే ఆడియెన్స్ కి క్రేజీగా ఉంటుంది.  ఆ తర్వాత రాశీఖన్నా కలవడం, ఆమెతో రొమాన్స్ ఆద్యంతం కట్టిపడేస్తాయి. మొదటి భాగం మొత్తం సిద్ధు తన మార్క్ మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీ, ఫన్‌తో సాగుతూ అలరిస్తుంది. మధ్య మధ్యలో కొంత స్లో అనిపించినా, ఆ వెంటనే ఆయా సీన్లని ఫన్‌తో, వైవా హర్షతో బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. అయితే ఇందులో క్రేజీ ఎలిమెంట్‌ ఏంటంటే తన మొదటి ప్రియురాలే తన బిడ్డను కనేందుకు రెడీ అవ్వడం. అది అదిరిపోయింది. ఈ విషయం సిద్ధుకి తెలియడం, తెలిసే ఆయన ఒప్పుకోవడం మరో క్రేజీ థింగ్‌గా చెప్పొచ్చు. ఇంటర్వెల్‌ ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్‌ అంతా ఇంట్లో అటు సిద్ధు, ఇటు రాశీఖన్నా, మరోవైపు శ్రీనిధిశెట్టిల మధ్య సాగే డ్రామాతో రన్‌ అవుతుంది. తన గతం గురించి చెప్పాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. ఆ ఎమోషన్స్ పీక్‌లోకి వెళ్లి, సుఖాంతంగా ముగించిన తీరు అలరిస్తుంది.

46
`తెలుసు కదా` మూవీ హైలైట్స్, మైనస్‌లు

సినిమాలో ఫన్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. అయితే ఇందులో `టిల్లు` మూవీస్‌లో కాకుండా సిద్ధు సెటిల్డ్ గా డైలాగ్‌లు చెప్పిన తీరు, వేసే పంచ్‌లు, సందర్భానుసారంగా జనరేట్‌ అయ్యే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ట్విస్ట్ లు, టర్న్ లు హైలైట్ నిలుస్తాయి. సెకండాఫ్‌ ఎమోషనల్‌గా తీసుకెళ్లిన తీరు కూడా ఆకట్టుకుంది. సినిమా కథేంటో తెలియడంతో దాన్ని రెండున్నరగంటలపాటు నడిపించడం పెద్ద టాస్క్. ఆ విషయంలో దర్శకురాలు సినిమాని డీల్‌ చేసిన తీరు బాగుంది. క్లైమాక్స్ ని బాగా డీల్‌ చేశారు. కాన్ల్ఫిక్ట్ ని కూడా బాగా హ్యాండిల్‌ చేశారు. సినిమాని నీట్‌గా తీసుకెళ్లిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషన్స్ బాగా వర్కౌట్‌ అయ్యాయి. అయితే సినిమా స్లోగా సాగడం కొంత బోర్‌ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొంత ల్యాగ్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. కథ ముందే అర్థం కావడం మైనస్‌గా చెప్పొచ్చు. క్లైమాక్స్ ని మరింత ఎమోషనల్‌గా డీల్‌ చేస్తే బాగుండేది. అయితే కామెడీ, ఎమోషన్స్ ని లైటర్‌వేలో చూపించారు. సినిమా మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్ మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న.

56
`తెలుసు కదా` మూవీ నటీనటుల ప్రదర్శన

సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి మెప్పించాడు. తన పాత్రతో సినిమాని నడిపించారు. ఇందులో కాస్త సెటిల్డ్ గా కనిపించాడు. కానీ తన మార్క్ కామెడీ, పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. డైలాగ్‌ కామెడీతో అలరించారు. రొమాంటిక్‌ సీన్లలోనూ రెచ్చిపోయాడు. కాకపోతే సిద్ధులో ఒక కొత్త యాంగిల్‌ ఇందులో కనిపిస్తుంది. కూల్‌గా పరిస్థితులను డీల్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక సిద్ధు భార్యగా రాశీఖన్నా కట్టిపడేసింది. రొమాంటిక్‌ సీన్లలో రెచ్చిపోయింది. ఇక సిద్దు మాజీ ప్రియురాలిగా శ్రీనిధి శెట్టి కనిపిస్తుంది. ఆమె పాత్ర సైతం అలరిస్తుంది. ఆమె పాత్రలోని వేరియేషన్‌ బాగుంది. వైవా హర్ష పాత్ర మరో ఆకర్షణగా ఉంటుంది. నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.

66
`తెలుసు కదా` మూవీ టెక్నీషియన్ల పనితీరు

ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. పాటలు బాగున్నాయి. బీజీఎం `ఓజీ` బీజీఎంని ఏమాత్రం మార్పు లేకుండా దించేశాడు. కాకపోతే ఆ లౌడ్‌ నెస్‌ తగ్గించాడు. జ్ఞానశేఖర్‌ విజువల్స్ బాగున్నాయి. ఆకట్టుకున్నాయి. నవీన్‌ ఎడిటింగ్‌ నీట్‌గా ఉంది. దర్శకురాలు నీరజ్‌ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్‌ చేయడం మామూలు విషయం కాదు. చాలా బాగా తెరకెక్కించారు. సినిమాని చాలా క్లాసీగా తీశారు. మాస్‌ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలిమెంట్లు జోడిస్తే బాగుండేది. కామెడీ ట్రాక్‌కి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కానీ లేటెస్ట్ ట్రెండ్‌ని ఆవిష్కరించిన తీరు మాత్రం బాగుంది. ఒక లేడీ డైరెక్టర్‌ మేల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథని చెప్పడం, అంతే ఓపెన్‌గా తెరకెక్కించడం ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలకు కొదవ లేదు.

ఫైనల్‌గాః నవ్విస్తూ భావోద్వేగాలకు గురి చేసే `తెలుసు కదా`.

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories