Mrunal Thakur: మ్యాక్స్ లో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌ చల్‌.. కొత్త ఫ్యాషన్స్ తీసుకొచ్చిన సీత

Published : Sep 23, 2026, 01:19 PM IST

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ `ది ఫ్యామిలీ స్టార్‌` సినిమా వరకు తెలుగులో సందడి చేసింది. వరుస సినిమాలతో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు కొంత గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకి మ్యాక్స్ లో మెరిసింది.

PREV
14
మ్యాక్స్ లో మెరిసిన మృణాల్‌ ఠాకూర్‌

మృణాల్‌ ఠాకూర్‌.. `సీతారామం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన విషయం తెలిసిందే. ఇందులో సీతగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత నానితో `హాయ్‌ నాన్న`, విజయ్‌ దేవరకొండతో `ది ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో మెరిసింది. అలాగే ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ`లోనూ మెరిసింది. ఈ క్రమంలో ఆమెకి తెలుగులో కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్‌ `రాకా`తో రాబోతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది. మ్యాక్స్ లో ఆమె హల్‌ చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది.

24
మ్యాక్స్ ఫ్యాషన్ హైదరాబాద్ స్టోర్‌ను సీఈవో సుమిత్‌ చంద్నాతో కలిసి ప్రారంభించిన మృణాల్ ఠాకూర్

హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని నెక్సస్‌ హైదరాబాద్‌లో మ్యాక్స్‌ ఫ్యాషన్‌ కొత్త స్టోర్‌ను ప్రారంభించారు. నగరంలో మ్యాక్స్‌ ఫ్యాషన్‌ సరికొత్త రూపంలో ఏర్పాటు చేసిన తొలి స్టోర్‌ ఇదే. మ్యాక్స్‌ ఫ్యాషన్‌ పండుగ సీజన్‌ కోసం రూపొందించిన ‘మ్యాక్స్‌ ప్రాజెక్ట్‌ న్యూ’ కలెక్షన్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫెస్టివ్‌ కలెక్షన్‌ను కల్కి కోచ్లిన్ క్యూరేట్‌ చేయగా, కళాకారులు డిజైన్‌ చేశారు. దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ నయా హంగులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ ఓపెనింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెరలు తొలగగానే.. అక్కడ మృణాల్‌ ఠాకూర్‌ కనిపించారు. మ్యాక్స్‌ ఫ్యాషన్‌ సీఈవో సుమిత్‌ చంద్నాతో కలిసి ఆమె ముందుకు వచ్చి రిబ్బన్‌ కట్‌ చేసి స్టోర్‌ తలుపులు తెరిచారు.

ఆ తర్వాత గదిలోని వారందరూ ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. కల్కి కోచ్లిన్ రూపొందించిన 'మ్యాక్స్ ప్రాజెక్ట్ న్యూ' కలెక్షన్‌ను మృణాల్ ఆవిష్కరించారు. ఇది రాజస్థాన్‌లోని సంగనేర్ బ్లాక్ ప్రింటింగ్ నుండి ఇన్‌స్పైర్‌ అయ్యారు. అదే సమయంలో చెన్నైలోని కైరస్సీ ఫౌండేషన్‌కు చెందిన దివ్యాంగులైన కళాకారుల అసలైన కళాకృతులను కలిగి ఉన్న పండుగ ప్రత్యేక కలెక్షన్. ఈ ప్రాంగణంలోని ప్రతి అంశాన్ని ప్రత్యేక ఉద్దేశంతో రూపొందించారు. విశాలమైన దారి సౌకర్యంగా కలెక్షన్లను చూసేలా ఆహ్వానిస్తాయి. తమ ప్రత్యేకతను తామే చాటుకునే కలెక్షన్లు , కస్టమర్‌ కదలికలకు అనుగుణంగా సహజంగా ముందుకు సాగేలా స్టోర్‌ లేఅవుట్‌ను తీర్చిదిద్దారు. తమకు నచ్చిన కలెక్షన్ సొంతం చేసుకోవటానికి ఎక్కువ సమయం గడపాలనిపించేలా ఈ ప్రదేశాన్ని రూపొందించారు.

34
మ్యాక్స్ స్టోర్‌ పై మృణాల్‌ కామెంట్‌

ఈ మ్యాక్స్ స్టోర్‌ ఓపెన్‌ చేసిన సందర్భంగా హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, `ఈ స్టోర్‌లో నడుస్తున్నప్పుడు, నాకు బాగా అనిపించిన విషయం ఏమిటంటే, ఇది ఒక సాధారణ దుకాణంలోకి అడుగుపెట్టినట్లు కాకుండా, ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నట్లుగా అనిపించడం. కలెక్షన్లను ప్రదర్శించే విధానం నుండి, లోపలికి వచ్చి మీకు నప్పే శైలిని సులభంగా కనుగొనే సౌలభ్యం వరకు... ప్రతి అంశంపై స్పష్టమైన ఆలోచనతో కూడిన ప్రణాళిక కనిపిస్తుంది. హైదరాబాద్‌కు ఈ తరహా అనుభవాలను మ్యాక్స్ తీసుకురావడం చూడటం సంతోషంగా ఉంది. అలాగే, ఈ వేడుకలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది` అని మృణాల్ ఠాకూర్ అన్నారు.

44
మ్యాక్స్ స్పెషాలిటీ చెప్పిన సీఈవో

`మ్యాక్స్ ఫ్యాషన్‌కు హైదరాబాద్ ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన మార్కెట్‌గా ఉంది, అందుకే ఈ నగరంలో మా మొదటి 'న్యూ ఐడెంటిటీ' స్టోర్ ఒక అర్థవంతమైన ముందడుగుగా భావిస్తున్నాం. కస్టమర్ల ఫ్యాషన్‌ను విభిన్నంగా కనుగొనగలిగే, మరింత అన్వేషణకు అవకాశం కల్పించే, స్ఫూర్తిని పొందేలా చేసే , ఆ అనుభవాన్ని తమ సొంతం చేసుకునేలా ఒక స్టేజ్‌ని సృష్టించాలనేది ఈ ఆలోచన . ఈ ప్రారంభోత్సవానికి మృణాల్ ఠాకూర్ హాజరు కావడం మరింత ప్రత్యేకంగా చేసింది. పండుగ సీజన్ ప్రారంభమవుతున్న ఈ తరుణంలో, మ్యాక్స్ కొత్త స్టోర్‌ ని ప్రారంభించడం ఆనందంగా ఉంది` అని మ్యాక్స్ ఫ్యాషన్ సీఈఓ సుమిత్ చంద్నా అన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories