Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?

Published : Sep 23, 2026, 01:44 PM IST

Mahaveer Karna First Look: నటుడిగా, డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా సౌత్ ఇండియాలో రాఘవ లారెన్స్‌కు మామూలు క్రేజ్ లేదు. ఇప్పటివరకు హారర్ సినిమాలతో భయపెట్టిన ఆయన, ఇప్పుడు పౌరాణిక సినిమాతో వీర యోధుడిగా వస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూద్దాం.

PREV
14
సౌత్ లో రాఘవ లారెన్స్‌ ఫాలోయింగ్

సౌత్ ఇండియాలో రాఘవ లారెన్స్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముని, కాంచన సిరీస్‌లతో పాటు స్టైల్ లాంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన తన పంథా మార్చారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'మహావీర కర్ణ' సినిమాలో పౌరాణిక యోధుడిగా ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2027లో థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

24
పౌరాణిక అవతారంలో...

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ పూర్తిగా పౌరాణిక అవతారంలో కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, చెవి పోగులు, ప్రత్యేకమైన కవచం, సూర్యుడిని సూచించే తిలకంతో ఆయన లుక్ అదిరిపోయింది. ఈ ఫస్ట్ లుక్‌ను లారెన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మన పురాణాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కర్ణుడి పాత్రను పోషించడం నిజంగా నా అదృష్టం. ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన డైరెక్టర్ రమేష్ వర్మకు నా కృతజ్ఞతలు" అని ఆయన రాసుకొచ్చారు.

34
కాస్టింగ్ విషయం రహస్యంగా..

రాఘవ లారెన్స్, డైరెక్టర్ రమేష్ వర్మ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో రమేష్ వర్మ 'ఖిలాడి', 'రాక్షసుడు' లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తుండగా, మిగతా కాస్టింగ్ వివరాలను చిత్రయూనిట్ ఇంకా బయటపెట్టలేదు. రామ్జీ దత్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీమణి డైలాగ్స్ రాస్తుండగా, జ్ఞాని సంగీతం అందిస్తున్నారు.

44
రాఘవ లారెన్స్ సినిమాలు..

'మహావీర కర్ణ' సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు లారెన్స్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బక్కియరాజ్ కన్నన్ డైరెక్షన్‌లో 'బెంజ్' సినిమా చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా వస్తున్న ఈ మూవీలో రవి మోహన్, నివిన్ పౌలీ కూడా నటిస్తున్నారు. అలాగే 'కాంచన 4' సినిమాను కూడా లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ, నిర్మిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories