రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9పై ప్రోమో రిలీజైన దగ్గర నుంచి ఈ రియాల్టీ షో గురించి ఆడియన్స్ లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది. ఈసారి హౌస్‌లోకి ఎవరెవరు అడుగు పెట్టనున్నారన్న దానిపై ఓ రేంజ్‌లో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్', 'కూకి జాతి రత్నాలు' లాంటి ప్రీ-షోల ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ షోలలో కనిపించిన ఇమ్మానుయేల్, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు ముగ్గురు టీవీ ఆర్టిస్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నారు. వీరిలో చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.