ప్రభాస్ సినిమాలో నటించకుండా ఉండాల్సింది, అదొక పీడకల.. రంగస్థలంలో ఛాన్స్ మిస్, మొగలిరేకులు సాగర్ కామెంట్స్

Published : Jul 09, 2025, 03:57 PM IST

మొగలిరేకులు సాగర్ గురించి పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు టీవీ సీరియల్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను చాలా కాలం ఉర్రూతలూగించింది. ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు.

PREV
15
బుల్లితెరపై సూపర్ స్టార్ 

మొగలిరేకులు సాగర్ గురించి పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు టీవీ సీరియల్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను చాలా కాలం ఉర్రూతలూగించింది. ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు. బుల్లితెరపై ప్రతి ఒక్కరికి అభిమాన నటుడిగా మారిపోయారు. ఒక రకంగా సాగర్ బుల్లితెరపై సూపర్ స్టార్ గా వెలుగొందారు.

ప్రస్తుతం సాగర్ సినిమాలపై ఫోకస్ చేశారు. సాగర్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది 100' చిత్రం జూలై 11న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సాగర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. గతంలో సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ లాంటి చిత్రాల్లో నటించారు. షాదీ ముబారక్ చిత్రంలో సాగర్ హీరోగా నటించారు. మరోసారి సాగర్ హీరోగా ది 100 చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

25
ప్రభాస్ సినిమాలో మొగలిరేకులు సాగర్ కి ఛాన్స్

ఓ ఇంటర్వ్యూలో సాగర్ మాట్లాడుతూ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంతో తనకి ఎదురైన చేదు అనుభవం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ సమయంలో బుల్లితెరపై నేను చాలా బిజీగా ఉన్నాను. తెలుగు ప్రేక్షకులంతా నన్ను తమ ఇంట్లో కుర్రాడిలా ఆదరించారు. ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ లాంటి పాత్ర అని నాకు చెప్పారు.

35
సాగర్ కి పీడకలలా మారిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ

మంచి అవకాశం కావడంతో నేను నటిస్తున్న టీవీ సీరియల్ యూనిట్ ని అడిగి కష్టపడి మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి డేట్లు అడ్జస్ట్ చేశాను. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నా కెరీర్ లో ఒక పీడకలలా మిగిలిపోయింది. నేను అంత కష్టపడి డేట్లు అడ్జస్ట్ చేసినప్పటికీ.. అందులో నాది సెకండ్ లీడ్ రోల్ కాదు. కనీసం కొన్ని నిమిషాలు కనిపించే పాత్ర కూడా కాదు. ఏంటిది అని చిత్ర యూనిట్ మీద అడిగితే చివరి నిమిషంలో కొన్ని పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఆ చేదు అనుభవం తర్వాత సినిమాలకు ఓకే చెప్పాలంటే నాకు భయం వేసేది.

45
రంగస్థలం చిత్రంలో ఆఫర్

ఆ తర్వాత కొంతకాలానికి నాకు సుకుమార్ గారి నుంచి పిలుపు వచ్చింది. ఆయనతో నాకు పరిచయం ఉంది.  రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రకి నిన్ను అనుకుంటున్నాం అని సుకుమార్ చెప్పారు. రంగస్థలం చిత్ర యూనిట్ తో కొన్ని మీటింగ్స్ జరిగాయి. నేను ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా బాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల.. రంగస్థలం చిత్రంలో నటించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.

55
గోల్డెన్ ఛాన్స్ మిస్

ముందు నటించకూడదు అని అనుకున్నా. ఆ తర్వాత ఆ పాత్ర కోసం ఆది పినిశెట్టిని సంప్రదించారు. ఆయన కూడా ముందుగా నో అని చెప్పారట. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ మనసు మార్చుకుని రంగస్థలం చిత్రంలో నటిస్తానని చెప్పాను. కానీ అప్పటికే ఆది పినిశెట్టి ఆ చిత్రానికి సైన్ చేసినట్లు తెలిసింది. ఆ విధంగా రంగస్థలం చిత్రం మిస్ అయిందని సాగర్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories