Brahmamudi: ట్రీట్మెంట్ విషయంలో షాకిచ్చిన డాక్టర్.. కావ్యదే తప్పంటూ చివాట్లు పెడుతున్న అపర్ణ?

Published : Jul 06, 2023, 08:56 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్న ఒక భార్య కదా ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 6 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: ట్రీట్మెంట్ విషయంలో షాకిచ్చిన డాక్టర్.. కావ్యదే తప్పంటూ చివాట్లు పెడుతున్న అపర్ణ?

ఎపిసోడ్ ప్రారంభంలో లాప్టాప్ చూస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు రాజ్. అంతలో అక్కడికి వచ్చిన కావ్య శుభ్రంగా భోజనం చేయడం మానేసి ఎందుకు ఆ చెత్త తినటం అంటుంది. నీ భోజనం కన్నా ఇదే బెటర్ అంటే లాప్టాప్ లో కావ్య డిజైన్ చేసిన నగలని చూస్తూ ఆనంద పడుతూ ఉంటాడు రాజ్. నిజంగా శృతి ఎంత బాగా నగలని డిజైన్ చేసింది. తను తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తుంది అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.
 

29

పోనీలెండి నన్ను నా ప్రేమని అర్థం చేసుకోకపోయినా నా టాలెంట్ ని గుర్తించారు అని అనుకుంటుంది కావ్య. మరోవైపు అప్పు కృష్ణమూర్తిని పిలిపించుకొని ఎందుకు నాన్న నా కోసం అంత బాధ పడతారు ఇక్కడ నుంచి వెళ్లిపోండి ఎలాగోలాగా నేను బయటకు వస్తాను అంటుంది. నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తాము అంటాడు  కృష్ణమూర్తి.  నా మీద కోపంగా ఉంది కదా నాన్న.
 

39

స్వప్నక్క కడుపు తెచ్చుకుని పెళ్లి చేసుకుని నీ పరువు తీసేసింది నేను జైలుకు వచ్చి నిన్ను తలెత్తుకోనికుండా చేశాను అని బాధపడుతుంది అప్పు. నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది మీ అక్కని ఒక మాట అంటేనే నువ్వు ఊరుకోలేకపోయావు అదే నువ్వు రక్తసంబంధానికి ఇచ్చే విలువ అంటాడు కృష్ణమూర్తి. మరి ఎందుకు నన్ను ఆ కన్నీరు అని అడుగుతుంది అప్పు. నిన్ను ఈ పరిస్థితుల్లో బయటకు తీసుకురావాలని ఒక చేతకాని తండ్రిని.
 

49

నీ భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది అంటాడు కృష్ణమూర్తి. నా గురించి మీరేమీ కంగారు పడకండి మీరు ఇంటికి వెళ్ళండి  అప్పు. నేను నీకు చెప్పవలసిన ధైర్యం నువ్వు నాకు చెప్తున్నావు పని బాధపడతాడు కృష్ణమూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకువచ్చాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది అని అప్పు పిలుస్తున్న వినిపించుకోకుండా కన్నీరు పెట్టుకుంటూ బయటికి వచ్చేస్తాడు కృష్ణమూర్తి.

59

అబ్బో ఏముంది అని అడుగుతుంది కనకం. మనల్ని ఇకనుంచి వెళ్ళిపోమంటుంది అని చెప్తాడు కృష్ణమూర్తి. మరోవైపు బెడ్ రూమ్ లో ఉన్న రాజ్ ఇంట్లో ఇద్దరమే ఉన్నము. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ముగ్గురం అయిపోతాము. అలా జరగడానికి వీల్లేదు అసలు తనని ఈ గదిలోకి రానీయకుండా అడ్డుకోవాలి అనుకుంటూ గుమ్మానికి అడ్డంగా నించుంటాడు. పని పూర్తి చేసుకుని వచ్చిన కావ్య టోల్గేట్ లాగా ఇక్కడ నుంచి ఉన్నారేంటి అని అడుగుతుంది.
 

69

నా శీలాన్ని కాపాడుకోవడానికి  అంటాడు రాజ్. మీరు మంచం మీద పడుకుంటారు నేను కిందన పడుకుంటాను అలాంటప్పుడు ఏం జరుగుతుంది అయినా భర్త గదిలో పడుకోవడం భార్య హక్కు అంటూ రాజుని తోసుకుంటూ గదిలోకి వస్తుంది కావ్య. అయితే నేనే బయట పడుకుంటాను అంటాడు రాజ్. మళ్లీ మెడ పట్టేయగలరు జాగ్రత్త అని కావ్య హెచ్చరించడంతో తన బెడ్ మీదే పడుకుంటాడు రాజ్. సగం రాత్రి అయిన తర్వాత అతనికి ఊపిరి అందక ఇబ్బంది పడతాడు.
 

79

అతను ఇబ్బంది పడుతున్న హడావుడికి కావ్య కి మెలకువ  వచ్చి కంగారు పడుతూ  అతనికి ఇన్హేలర్  అందిస్తుంది కానీ అందులో మెడిసిన్ అయిపోవడంతో వాచ్మెన్ టు వీలర్ తీసుకొని రాజ్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంది. డాక్టర్ రాజిని రూమ్ లోకి తీసుకు వెళ్ళమని చెప్పి కావ్యతో ఫార్మాలిటీస్  అన్ని పూర్తి చేయమని చెప్తాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత పాతికవేలు అడ్వాన్స్ కట్టమంటుంది రిసెప్షనిస్ట్.
 

89

నేను కంగారులో వచ్చేసాను నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అని చెప్పటంతో మా రూల్స్ ఒప్పుకోవు ట్రీట్మెంట్ జరగదు అంటాడు డాక్టర్. మీకు హ్యుమానిటీ లేదు అంటూ ఏడుస్తుంది కావ్య. డబ్బుల కోసం మీరు ఏమి కంగారు పడొద్దు రేపొద్దున కల్లా మీ డబ్బులు మీ చేతిలో పెడతాను అంటూ ఎంత బ్రతిమాలిన వినిపించుకోడు డాక్టర్. అప్పుడు కళ్యాణ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది కావ్య.

99

తరువాయి భాగంలో ఎవరినైనా పెద్దవాళ్లని తీసుకువచ్చి కేసు విత్డ్రా చేసుకోండి. లేదంటే కేసు కాంప్లికేట్ అవుతుంది అని కనకం దంపతులకు సలహా ఇస్తుంది కానిస్టేబుల్. సీతారామయ్యగారి కాళ్లు పట్టుకొని ఈ సమస్య నుంచి బయట పడదాం అనుకుంటూ కావ్య ఇంటికి బయలుదేరుతారు కనకం దంపతులు. అదే సమయంలో కావ్య జాగ్రత్త వల్లే రాజ్ కి ప్రమాదం జరిగిందని కావ్యని నానా చివాట్లు పెడుతుంది అపర్ణ. ఆ మాటలు అన్నీ అప్పుడే అక్కడికి వచ్చిన కనుక్కొని దంపతులు వింటారు.

click me!

Recommended Stories