కానీ అప్పటికే ఈ బ్యూటీని పట్టించుకోవడం మానేశారు మేకర్స్. దీంతో అసలు సవాల్ అప్పుడే ఎదురయ్యింది. ఆఫర్లు రావడమనేది పెద్ద టాస్క్. ఇండస్ట్రీలో ఒక్కసారి గ్యాప్ ఇస్తే మళ్లీ పుంజుకోవడం కష్టం. అవికా పరిస్థితి కూడా అలానే మారింది. అయితే `రాజుగారి గది3`, `నెట్`, `బ్రో`, `టెన్త్ క్లాస్ డైరీస్`, `థ్యాంక్యూ`, `పాప్‌కార్న్` చిత్రాల్లో నటించింది. కానీ ఇవి పరాజయం చెందాయి. చివరికి `పాప్‌కార్న్` మూవీతో ఆమె నిర్మాతగానూ మారింది. కానీ ప్రయోజయం లేదు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుంది అవికా. దీంతోపాటో ఓ ఓటీటీ ఫిల్మ్ కూడా చేస్తుంది.